CM KCR : రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..!

రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్.... రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పెద్ద ఎత్తున చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సుమారు 210 కోట్లతో పూర్తి చేసిన పలు భవన సముదాయాలను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. 64 కోట్ల రూపాయలతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అలాగే 87 కోట్లతో నిర్మించిన 1320 డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించి... లబ్దిదారులకు అందజేస్తారు. ఇంటర్‌నేషనల్ డ్రైవింగ్ స్కూల్, సర్థాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డ్‌ను కూడా ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ టూర్ సందర్భంగా... ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. అటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com