వంటిమామిడి మార్కెట్‌యార్డును సందర్శించిన సీఎం కేసీఆర్!

సిద్ధిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డుని తెలంగాణ సీఎం కేసీఆర్ సందర్శించారు. అక్కడ రైతులతో కాసేపు ముచ్చటించారు సీఎం.. విక్రేతలు, కూరగాయలు సాగుచేస్తున్న రైతులను ధరలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు కూరగాయలు నిల్వ చేసుకునేందుకు వీలుగా కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. నిర్మాణానికి గాను 50 ఎకరాల స్థలంను గుర్తించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఇక వంటి మామిడి కూరగాయల మార్కెట్లో రైతుల నుంచి ఏజెంట్లు 4శాతం కంటే ఎక్కువ కమీషన్ తీసుకోవద్దని హెచ్చరించారు. రైతులను ఆగం చేయాలనీ చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com