KCR : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
CM KCR : తెలంగాణ ఆవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు సీఎం కేసీఆర్. దేశానికే దిక్సూచిగా తెలంగాణ తన ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోందన్నారు. వివిధ రంగాల్లో గుణాత్మక అభివృద్ధి నమోదు చేస్తోందని..విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో గుణాత్మక అభివృద్ధి జరిగిందన్నారు. దీనికి జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలే సాక్ష్యమన్నారు కేసీఆర్. 8 ఏళ్లలో ఊహించినంత సంక్షేమం, అభివృద్ధి సాధించామన్నారు. పరిశ్రమల మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం దేశానికే పాఠమని కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, ప్రజా సంక్షేమ పాలనను ప్రభుత్వం అందిస్తోందన్నారు. రాష్ట్రానికి సహకరించాల్సిన కేంద్రం...ఆటంకం కలిగిస్తున్నా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు కేసీఆర్. ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు ఆవతరణ దినోత్సవ వేడుకలను పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. గత రెండేళ్లు కరోనా కారణంగా రాష్ట్ర ఆవతరణ వేడుకలను ఆర్భాటంగా నిర్వహించలేదు. ఐతే ఈ సారి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఘనంగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం దగ్గర సీఎం కేసీఆర్ నివాళులర్పిస్తారు. తర్వాత పబ్లిక్ గార్డెన్స్ చేరుకుని వేడుకల్లో పాల్గొంటారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి..సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత తెలంగాణ 8 ప్రగతి ప్రస్థానాన్ని కేసీఆర్ వివరిస్తారు. అంతర్జాతీయ క్రీడల్లో అద్భతంగా రాణించిన క్రీడాకారిణిలు నికత్ జరీన్, ఇషాసింగ్‌లను సన్మానించడంతో పాటు నగదు పురస్కారాన్ని కేసీఆర్ అందిస్తారు. కిన్నెర మొగిలయ్యకు కోటి నగదు పురస్కారాన్ని అందిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com