REVANTH: హరీశ్‌రావుపై సీఎం రేవంత్ ఆగ్రహం

స్టేషన్ ఘన్‌పూర్ బహిరంగ సభలో హరీశ్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాటి చెట్టంత పెరిగినా అవకాయంత తెలివితేటలు హరీశ్‌కు లేవని విమర్శించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన ప్రాజెక్టులు నేటిని తెలంగాణకు నీరు అందిస్తున్నాయి. ప్రాజెక్టులపై పిల్ల కాకులతో నాకెందుకు.. అసలైన వాళ్ల(కేసీఆర్)నే రమ్మనండి’ అని హరీశ్ రావుకు సీఎం సవాల్ విసిరారు. ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదమో కేసీఆర్ చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే వరంగల్‌కు ఎయిర్‌పోర్టు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే ఎయిర్‌పోర్టును సాధించి మీ ముందు నిల్చున్నా. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం’ అని సీఎం పేర్కొన్నారు.
అసెంబ్లీకి రావాలని సవాల్
బీఆర్ఎస్ నేత హరీష్ రావు పిల్లకాకి అని, అసలు మనిషి కేసీఆర్‌ను అసెంబ్లీకి వచ్చి ప్రాజెక్టులపై చర్చ జరపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ చేసిన పాపల చిట్టా అసెంబ్లీలో చెప్పా... ఇప్పటి వరకు జరిగింది కేవలం ఇంటర్వెల్ మాత్రమే. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా కేసీఆర్ మొత్తం చిట్టా విప్పుతా అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘కృష్ణా నది నీటిపై లక్షా 81వేల కోట్లు కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం వాడారు. లక్ష కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయింది. రిపేర్లు చేయాలంటే ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్ ప్రాజెక్టులు కట్టారని పెద్ద మాటలు చెబుతున్న హరీష్ రావు తాటిచెట్టంతా పెరిగాడు కానీ ఆయన మెదడులో ఆవకాయ అంత తెలివితేటలు లేవు. శ్రీరాం సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఎవడు కట్టాడో చెప్పాలి’ అన్నారు.
ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే..
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో రూ.800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనంతరం ప్రజా పాలన సభలో పాల్గొని ప్రసంగించారు. ‘జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, దేవాదుల, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను కట్టించి, మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా. తెలంగాణ ప్రభుత్వం కోటి 56 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల వరి పండించాం. హరీష్ రావు (పిల్లకాకులు)లతో నాకేంటి. అసలైన ఆయన కేసీఆర్ నే చర్చకు రావాలని, ఆయననే రమ్మని ఛాలెంజ్ విసిరారు. శ్రీరాంసాగర్, నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, బీమా, నెట్టెంపాడు, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ మీద మాట్లాడుతారా.. అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే మేం ఏం చేశామో తెలుస్తుంది.
వాళ్లు అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు
‘గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో కార్యకర్త ప్రసంగంలా ఉందని కొందరు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. 2022లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభించి మహిళా గవర్నర్‌ను గత ప్రభుత్వం అవమానించింది. మంత్రివర్గ ఆమోదం పొందిన అంశాలే గవర్నర్ ప్రసంగంలో ఉంటాయనే అవగాహన కూడా లేకుండా విపక్ష నేతలు మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com