Telangana: రాష్ట్రంలో టాాటా టెక్నాలజీస్ నైపుణ్య శిక్షణ

Telangana:  రాష్ట్రంలో టాాటా టెక్నాలజీస్ నైపుణ్య శిక్షణ
X
50 ఐటీఐల్లో టాటా ట్రైనింగ్.. చదువు పూర్తవగానే ఉద్యోగం వచ్చేలా శిక్షణ

రాష్ట్రంలోని I.T.Iలలో సుమారు 2వేల కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేపట్టేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ముందుకొచ్చింది. డిమాండ్ ఉన్న రంగాల్లో ఉపాధి కలిగేలా 22 స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులను టాటా టెక్నాలజీస్‌ అందించనుంది. టాటా టెక్నాలజీస్‌తో ప్రభుత్వ ఒప్పందానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాలం చెల్లిన కోర్సులతో యువత సమయాన్ని, విద్యను వృథా చేయకుండా... ఆధునాతన కోర్సుల్లో శిక్షణకోసం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని సీఎం తెలిపారు.

రాష్ట్రంలో ఐటీఐలలో కోర్సుల రూపురేఖలు మార్చేందుకు టాటా టెక్నాలజీస్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 ఐటీఐలలో సుమారు 1500 నుంచి 2 వేల కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేపట్టేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ముందుకొచ్చింది. డిమాండ్ ఉన్న రంగాల్లో ఉపాధి కల్పించడానికి 22 స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులను... పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ ప్రాజెక్టు ద్వారా అందిస్తుంది. అత్యాధునిక నైపుణ్య కేంద్రాలను ఏర్పాటుతోపాటు వాటి నిర్వహణకు అవసరమైన యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్‌వేర్‌తోపాటు ఇద్దరు మాస్టర్ ట్రైయినర్లను టాటా టెక్నాలజీస్ అందిస్తుంది.

ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రొబోటిక్స్, CSC మెషినింగ్ టెక్నీషియన్, ఈవీ మెకానిక్, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫైయర్ వంటి పరిశ్రమ ఆధారిత కోర్సుల్లో నైపుణ్యాన్ని అందించేందుకు టాటా సంస్థ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టులో ఐదేళ్లపాటు టాటా సంస్థ ఉచితంగా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అందిస్తుంది. టాటా టెక్నాలజీస్ ప్రతిపాదనలకు సీఎం అంగీకరించారు. టాటా టెక్నాలజీస్‌తో ఎంఓయూ కుదుర్చుకోవడానికి ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. సుమారు లక్ష మంది విద్యార్థులు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇచ్చేందుకు టాటా టెక్నాలజీస్ ముందుకు రావడాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు.

ప్రపంచంతో పోటీపడేలా ఆధునిక సాంకేతికతను తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి రాష్ట్ర పభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం స్పష్టం చేశారు. ఉద్యోగాలు, ఉపాధి పొందేలా సాంకేతిక కోర్సులు ఉండాలని టాటా సంస్థ ప్రతినిధులు, అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. ఎంవోయూ, విధివిధానాలు ఖరారు చేసేందుకు టాటా టెక్నాలజీతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్న ఉపాధికల్పన, కార్మిక శాఖ … రాష్ట్రంలో 50 ప్రభుత్వ ఐటీఐలను గుర్తించింది.

Tags

Next Story