REVANTH: సీఎం రేవంత్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

REVANTH: సీఎం రేవంత్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి దా­ఖ­లు చే­సిన క్వా­ష్ పి­టి­ష­న్‌­పై హై­ద­రా­బా­ద్ హై­కో­ర్టు వి­చా­ర­ణ­ను వా­యి­దా వే­సిం­ది. బీ­జే­పీ తర­ఫున న్యా­య­వా­ది వా­ద­న­లు వి­ని­పిం­చేం­దు­కు సమయం కో­ర­డం­తో జూలై 8వ తే­దీ­ని తదు­ప­రి వి­చా­రణ తే­దీ­గా న్యా­య­స్థా­నం పే­ర్కొం­ది. ఈ కే­సు­లో ప్ర­ధాన అంశం – బీ­జే­పీ నేత కాసం వెం­క­టే­శ్వ­ర్లు సీఎం రే­వం­త్‌­పై పరు­వు­న­ష్టం దావా వే­సిన వి­ష­యం. బీ­జే­పీ అధి­కా­రం­లో­కి వచ్చి­న­పు­డు రి­జ­ర్వే­ష­న్లు రద్దు చే­స్తుం­ద­ని రే­వం­త్ రె­డ్డి ఓ సభలో చే­సిన వ్యా­ఖ్య­లు, తమ పా­ర్టీ ప్ర­తి­ష్ట­ను ది­గ­జా­ర్చి­న­ట్లు­గా, ప్ర­జ­ల్లో అపో­హ­లు కలి­గిం­చా­యం­టూ వెం­క­టే­శ్వ­ర్లు ఫి­ర్యా­దు చే­శా­రు. దీం­తో రే­వం­త్ ఈ కే­సు­ను కొ­ట్టి­వే­యా­ల­ని కో­రు­తూ హై­కో­ర్టు­ను ఆశ్ర­యిం­చా­రు. కో­ర్టు తాజా తీ­ర్పు­తో రా­జ­కీయ, న్యాయ వర్గా­ల్లో ఉత్కంఠ నె­ల­కొం­ది.

Tags

Next Story