REVANTH: చర్మపల్లి టర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు

REVANTH: చర్మపల్లి టర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు
X
నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోశయ్య పేరు.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన

తెలుగు విశ్వ విద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించడంపై వివాదం కొనసాగుతున్న వేళ.. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. చర్లపల్లి టర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెడతామని వెల్లడించారు. బల్కంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రికి దివంగత మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పేరు పెడతామని తెలిపారు. దీనిపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు లేఖ కూడా రాస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని గత ప్రభుత్వంలో కూనంనేని సాంబశివరావు కోరారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో తెలిపారు. అందుకే యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టాలని గత శాసనసభ భేటీలోనే నిర్ణయించామని తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను అందరూ గుర్తించాల్సిందే అని... అయితే తెలంగాణ కోసం కృషి చేసిన వాళ్లను స్మరించుకోవాలని రేవంత్ అన్నారు.

కులాలను ఆపాదించడం సరికాదు: సీఎం

తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ శాసనసభలో మరోసారి స్పష్టం చేశారు. ఒక వ్యక్తి కోసమో.. కులం కోసమో ఈ నిర్ణయం తీసుకోలేదని... ప్రముఖులకు కులాన్ని ఆపాదించడం సరికాదని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు కలుషితం అయ్యాయో... ఆలోచనలు కలుషితం అయ్యాయో తెలియడం లేదని రేవంత్ అన్నారు. తెలంగాణ ప్రముఖులను స్మరించుకుంటామని వెల్లడించారు.

Tags

Next Story