REVANTH: కేసీఆర్ అసెంబ్లీకి రా.. లెక్కలన్నీ చెప్తాం: రేవంత్

REVANTH: కేసీఆర్ అసెంబ్లీకి రా.. లెక్కలన్నీ చెప్తాం: రేవంత్
X
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ ఘాటు విమర్శలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే.. శాసనసభకు వచ్చి లెక్కలు అడగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే కేసీఆర్ శాసనసభకు రావాలని... లెక్కలు అన్ని చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు చెప్తామని అన్నారు. కేసీఆర్ చెప్పిన అబద్దాల వల్లే తెలంగాణలో ఓడిపోయారని అన్నారు. తెలంగాణను రైతు బంధు ఇవ్వలేని స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ను బలంగా కొడతా అంటున్న కేసీఆర్.. అసలు నిలబడగలరా అని ప్రశ్నించారు. కేసీఆర్ కాలం చెల్లిన రూ. వెయ్యి నోటు అని అన్నారు. గుమ్మికింద పందికొక్కులా మిగులు బడ్జెట్ ను బీఆర్ఎస్ నేతలు తినేశారని రేవంత్ అన్నారు. కేసీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజలు గుణపాఠం చెప్పినా.. కేసీఆర్ ఇంకా మారలేదని రేవంత్ మండిపడ్డారు.

సోషల్ మీడియా లైకులతో సంబరాలా

కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోల్ లో తమకే ప్రజల మద్దతు ఎక్కువ ఉందని తేలిందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై.. రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. రాఖీ సావంత్ కు పెట్టిన పోల్ లోనూ రాఖీ సావంత్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. అంత మాత్రానా సల్మాన్ స్టార్ డమ్ ఏమైనా తగ్గుతుందా అని రేవంత్ ప్రశ్నించారు. సోషల్ మీడియా లైకులు చూసి కేసీఆర్ సంబరపడుతున్నారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.

ఫామ్ హోస్ లో ఉండి సోది చెప్పొద్దు: రేవంత్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ధనిక రాష్ట్రమంటూ అబద్దాలు చెప్తూ.. తెలంగాణను అప్పులకుప్పలుగా మార్చారని మండిపడ్డారు. పదేళ్లలో 8 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. దమ్ముంటే అసెంబ్లీకి చర్చకు రావాలని కేసీఆర్ కు రేవంత్ సవాల్ విసిరారు. ఫామ్ హౌస్ కు వచ్చిన వారికి సోది చెప్పడం కాదని చర్చకు రావాలని అన్నారు. పాలమూరును సైతం కేసీఆర్ ఎండబెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్ అంటున్నారని.. కానీ ఎవరూ బాధపడడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ మాదిరి హామీలను తాము ఎగ్గొట్టమన్నారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలను ఏడాదిలో ఇచ్చామని గుర్తు చేశారు.

Tags

Next Story