TS: వైద్య కళాశాల ఉన్న ప్రతిచోట నర్సింగ్‌, పారామెడికల్‌ కాలేజీలు

TS: వైద్య కళాశాల ఉన్న ప్రతిచోట నర్సింగ్‌, పారామెడికల్‌ కాలేజీలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం... బీబీనగర్‌ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలన్న సీఎం..

తెలంగాణలో వైద్య కళాశాల ఉన్న ప్రతిచోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేలా ఉమ్మడి విధానాన్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని CM కోరారు. ఎయిమ్స్‌లోపూర్తిస్థాయి వైద్య సేవల కోసం.. అవసరమైతే కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానని చెప్పారు. సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కొన్నింటిని గుర్తించి.. వాటికి CMRF LOC ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. బోధనాసుపత్రుల్లో హౌజ్ కీపింగ్ నిర్వహణ బాధ్యత ఫార్మా కంపెనీలకు అప్పగించాలని సూచించారు.


వైద్య కళాశాల ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అందుకోసం ఉమ్మడి విధానాన్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొడంగల్ లో మెడికల్, నర్సింగ్ కాలేజిల ఏర్పాటును పరిశీలించాలని సూచించిన CM... బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందనీ... తద్వారా ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై భారం తగ్గుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఎయిమ్స్‌ను సందర్శించి పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానని తెలిపారు.


ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో సమస్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మంగళవారం కోర్టులో బెంచ్ పైకి ఉస్మానియా హెరిటేజ్ భవనం వ్యవహారం రానున్న తరుణంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఏరియాల వారీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో కొన్నింటిని గుర్తించి వాటికి CMRF LOC ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని CM సూచించారు. వైద్య కళాశాలలకు అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్‌కీపింగ్‌ మెయింటెనెన్స్‌ నిర్వహణ బాధ్యత పెద్ద ఫార్మా కంపెనీలకు అప్పగించాలని CM అన్నారు. నిర్వహణ ఖర్చు ఆ సంస్థలే భరించేలా చూడాలని అధికారులకు తెలిపారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ఏదో ఒక ఆసుపత్రిలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధులకు సంబంధించి వివరాలను CM అడిగి తెలుసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story