REAVANTH: ప్రపంచానికే దిక్సూచిగా తెలంగాణ

REAVANTH: ప్రపంచానికే దిక్సూచిగా తెలంగాణ
X
తన లక్ష్యం అదేనన్న రేవంత్‌రెడ్డి... సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలను ప్రజలకు వివరించిన సీఎం

తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి ఆర్థిక, సాంస్కృతిక పునర్జీవాలే కీలకాంశాలుగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. గడచిన పదేళ్ల పాలనలో భౌతిక విధ్వంసంతోపాటు... తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగిందన్నారు. వీటిని సరిచేస్తూ.. రాష్ట్ర గీతంగా ' జయ జయహే తెలంగాణ' తో... తొలి అడుగు వేశామన్నారు. తెలంగాణ ప్రపంచానికే దిక్సూచి కావాలనేదే సర్కార్‌ లక్ష్యమని.. దశాబ్ది వేడుకల వేదికగా సీఎం ప్రకటించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరిగాయి. ముందుగా.. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద మంత్రులతో కలిసి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి.. పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి... పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు..


తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు, పదేళ్ల బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పాలన, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రణాళికల్ని ప్రజల ముందుంచారు. ఏ హోదాలో సోనియాగాంధీని ఆహ్వానించారని అడుగుతున్నారని... బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా? అని ప్రశ్నించారు. పదేళ్లలో హరించిన స్వేచ్ఛకు ప్రజాపాలనలో ప్రాధాన్యం ఇస్తూ.. పాలకులం కాదు సేవకులమని.. ఇప్పటికే నిరూపించామని సీఎం పేర్కొన్నారు. బోనం నుంచి బతుకమ్మ వరకు.. సాయుధ పోరాటం నుంచి స్వరాష్ట్ర ఉద్యమం వరకు తెలంగాణ సంస్కృతి, చరిత్ర గొప్పవని.. వాటి పునరుజ్జీవనం జరిగేలా చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. ప్రజల ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాల్లో మార్పులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.

దీర్ఘ కాలిక ప్రణాళికల్లో భాగంగా "గ్రీన్ తెలంగాణ-2050 బృహత్‌ ప్రణాళిక” తయారు చేస్తున్నామని సీఎం వివరించారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన కృష్ణా, గోదావరి జలాల్లో వాటా సాధిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు ముగిసిందని.. APతో ఆస్తుల విభజనకు సంబంధించి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటామన్నారు. ప్రభుత్వ ప్రణాళికలతో తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలనేదే లక్ష్యమని ఆకాంక్షించారు.

Tags

Next Story