REVANTH: అభివృద్ధికి ఆ "బ్యాడ్ బ్రదర్స్‌" అడ్డు

REVANTH: అభివృద్ధికి ఆ బ్యాడ్ బ్రదర్స్‌ అడ్డు
X
హీరోయిన్లతో ఎలా గడిపారో అందరికీ తెలుసు.. ఇండస్ట్రీని ఎలా వాడుకున్నారో తెలుసు..ముఖ్యమంత్రి రేవంత్ సంచలన ఆరోపణలు

ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. తె­లం­గా­ణ­లో ఇక నుం­చి గం­జా­యి, డ్ర­గ్స్ అనే మాటే వి­న­ప­డ­కూ­డ­ద­ని అన్నా­రు. గం­జా­యి, డ్ర­గ్స్‌­తో తె­లం­గా­ణ­లో అడు­గు­పె­ట్టా­లం­టే వె­న్ను­లో వణు­కు పు­ట్టా­ల­ని చె­ప్పా­రు. ఎవ­రై­నా గం­జా­యి­తో రా­ష్ట్రం­లో దొ­రి­కి­తే.. ఒక్కొ­క్క­డి­ని తొ­క్కి నార తీ­స్తా­మ­ని రె­చ్చి­పో­యా­రు. రా­ష్ట్రం­లో ఈగల్ టీ­మ్‌ వ్య­వ­స్థ­ను తీ­సు­కొ­చ్చి గం­జా­యి, డ్ర­గ్స్‌­ను అరి­క­డు­తు­న్నాం.. హై­డ్రా వ్య­వ­స్థ­ను తీ­సు­కొ­చ్చి చె­రు­వు­లు ఆక్ర­మ­ణ­లు గురి కా­కుం­డా కా­పా­డు­తు­న్నా­మ­ని అని అన్నా­రు. మం­త్రు­లు పొ­న్నం అడ్లూ­రి లక్ష్మ­ణ్, అజా­రు­ద్దీ­న్‌, పొ­న్నం ప్ర­భా­క­ర్‌­ల­తో కలి­సి మీ­డి­యా సమా­వే­శం ని­ర్వ­హిం­చా­రు. సీఎం రే­వం­త్‌ రె­డ్డి మా­ట్లా­డు­తూ.. బ్యా­డ్ బ్ర­ద­ర్స్.. కి­ష­న్ రె­డ్డి, కే­టీ­ఆ­ర్.. ఇద్ద­రు కలి­సి మె­ట్రో వి­స్త­రణ అపు­తు­న్నా­ర­ని ఆయన ఆరో­పిం­చా­రు. పీ­జే­ఆ­ర్.. శశి­ధ­ర్ రె­డ్డి లు హై­ద­రా­బా­ద్ బ్ర­ద­ర్స్.. హై­ద­రా­బా­ద్ బ్ర­ద­ర్స్ అభి­వృ­ద్ధి చే­శా­రు.. బ్యా­డ్ బ్ర­ద­ర్స్.. అభి­వృ­ద్ధి­ని అడ్డు­కుం­టు­న్నా­ర­ని ఆయన మం­డి­ప­డ్డా­రు. కే­టీ­ఆ­ర్ నగ­రా­ని­కి తె­చ్చిన గొ­ప్ప వరం.. గం­జా­యి, డ్ర­గ్స్ అని ఆయన ఎద్దే­వా చే­శా­రు. కే­టీ­ఆ­ర్ ఓ వి­ష­పు­రు­గు.. నగ­రా­ని­కి గం­జా­యి, డ్ర­గ్స్ తీ­సు­కొ­చ్చేం­దే కే­టీ­ఆ­ర్ అన్నా­రు. నగ­రం­లో అత్యా­చా­రా­ల­కు గం­జా­యి, డ్ర­గ్సే కా­ర­ణ­మ­ని చె­ప్పా­రు.

అభివృద్ధి చేసింది మేమే..

తె­లం­గాణ రా­ష్ట్రా­న్ని అభి­వృ­ద్ధి చే­సిం­ది మేమే.. చే­సే­ది మేమే.. అం­దు­కే తమకు ఓట్లు వే­యం­డి అని అడు­గు­తు­న్నా­మ­ని అన్నా­రు. బీ­ఆ­ర్ఎ­స్‌ హయాం­లో ఇం­డ­స్ట్రీ­ని ఎలా వా­డు­కు­న్నా­రో.. హీ­రో­యి­న్ల­తో ఎలా గడి­పా­రో అం­ద­రి­కీ తె­లు­స­ని షా­కిం­గ్ కా­మెం­ట్స్ చే­శా­రు. బీ­ఆ­ర్ఎ­స్‌­లో ఒక్కొ­క్క­రి రా­జ­కీ­యం­గా ఎలి­మి­నే­ట్ చే­స్తూ వచ్చా­రు.. పా­ర్టీ­లో కీలక నే­త­ల­ను చాలా చా­క­చ­క్యం­గా హరీ­ష్ రావు బయ­ట­కు పం­పిం­చి­వే­శా­రు.. చి­వ­ర­కు కల్వ­కుం­ట్ల కు­టుం­బా­న్ని కూడా వి­డ­దీ­స్తు­న్నా­రు.. ఆల్రె­డీ ఒక­రి­ని సక్సె­స్‌­ఫు­ల్‌­గా బయ­ట­కు పం­పా­రు కూడా అని అన్నా­రు. జూ­బ్లీ­హి­ల్స్‌ కాం­గ్రె­స్‌ అభ్య­ర్థి­ని పదే పడే రౌడీ అని ప్ర­చా­రం చే­స్తు­న్నా­రు.. దీ­పా­వ­ళి రో­జున డ్ర­గ్స్ వాడే వాడు రౌ­డీ­నా?.. ని­త్యం ప్ర­జ­ల్లో ఉండే వాడు రౌ­డీ­నో ప్ర­జ­లు తె­లు­సు­కో­వా­ల­ని కో­రా­రు. మై­నా­ర్టీ నేత అజా­రు­ద్దీ­న్‌­కు మం­త్రి పదవి ఇస్తే కూడా ఓర్వ­లే­ని వ్య­క్తు­లు వీరు అని బీ­ఆ­ర్ఎ­స్ నే­త­ల­పై సీఎం రే­వం­త్ రె­డ్డి తీ­వ్ర వ్యా­ఖ్య­లు చే­శా­రు. "కే­టీ­ఆ­ర్ అనే వాడు.. విష పు­రు­గు.. 44 చె­రు­వు­లు బీ­ఆ­ర్‌­ఎ­స్‌ వా­ళ్ళు ఆక్ర­మిం­చి అమ్మే­శా­రు.. హై­డ్రా మీద విషం చి­మ్మే­ది మీరు కాదా..? బతు­క­మ్మ కుంట ఆక్ర­మిం­చు­కు­న్నా­డు ఎవడు..? ఎడ్ల సు­ధా­క­ర్… కే­సీ­ఆ­ర్‌­కి హె­లి­కా­ప్ట­ర్‌­తో పూలు చల్లా­డు అని బతు­క­మ్మ కుంట ఆక్ర­మిం­చ­లే­దా..?” అని ప్ర­శ్నిం­చా­రు.

సీఎం రేవంత్‌కి లీగల్​ నోటీసులు?

జూ­బ్లీ­హి­ల్స్‌ ఉప ఎన్ని­కల వేళ.. సీఎం రే­వం­త్ రె­డ్డి వి­మ­ర్శ­లు హద్దు­లు దా­టా­యి. బీ­ఆ­ర్ఎ­స్‌ హయాం­లో సినీ ఇం­డ­స్ట్రీ­ని కే­టీ­ఆ­ర్ ఎలా వా­డు­కు­న్నా­రో.. హీ­రో­యి­న్ల­తో ఎలా గడి­పా­రో అం­ద­రి­కీ తె­లు­సం­టూ తీ­వ్ర వి­మ­ర్శ­లు చే­శా­రు. సీఎం వి­మ­ర్శ­ల­పై కే­టీ­ఆ­ర్ తీ­వ్రం­గా స్పం­దిం­చే అవ­కా­శం ఉంది. గతం­లో ఇటు­వం­టి వి­మ­ర్శ­లు చే­సిన మం­త్రి కొం­డా సు­రే­ఖ­కు కే­టీ­ఆ­ర్ లీ­గ­ల్​ నో­టీ­సు­లు పం­పి­చా­రు. సీ­ఎం­కు కూడా లీ­గ­ల్ నో­టీ­సు­లు పం­పిం­చే అవ­కా­శం ఉంది. దీ­ని­పై గతం­లో­నూ కే­టీ­ఆ­ర్ ఘా­టు­గా స్పం­దిం­చా­రు.

Tags

Next Story