CM Revanth: కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఆరా

CM Revanth:  కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఆరా
యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించిన రిజ్వీ

ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌ బాత్రూంలో జారిపడి హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్య ఆరోగ్యఖశాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో యశోద ఆసుపత్రికి చేరుకున్న రిజ్వీ.. కేసీఆర్‌ను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం విషయాన్ని సీఎం రేవంత్‌కు వివరించారు. కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. కేసీఆర్‭కు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి హుటాహుటిన యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి, ఆయనకు అందుతున్న వైద్యం గురించి యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ హెల్త్ బులెటిన్ ను యశోదా ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. తన నివాసంలోని బాత్రూమ్ లో కేసీఆర్ స్లిప్ అయ్యారని... దీంతో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి ఆయనను తీసుకొచ్చారని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. సీటీ స్కాన్ తో పాటు పలు పరీక్షలను నిర్వహించిన అనంతరం... ఆయన ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించామని చెప్పారు. ఆయన ఎడమ తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని చెప్పారు. ఆర్థోపిడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ విభాగాలకు చెందిన మల్టీ డిసిప్లినరీ టీమ్ ఆయనను పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

వాస్తవానికి ఈ విషయం రాత్రే ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో పోలీస్ అధికారుల భద్రత నడుమ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆరోగ్యం గురించి ప్రభుత్వ ఆరోగ్య శాఖ పరిశీలిస్తూనే ఉంది.

తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారు. గురువారం అర్థరాత్రి ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు. అంతే కాకుండా, ఈ ప్రమాదంతో గతంలో విరిగిన కాలు గాయం మరోసారి తిరగబడిందని వైద్యులు తెలిపారు. వెంటనే ఆయనను యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

Tags

Next Story