Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తన సొంతూరు నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. ప్రతి సంవత్సరం దసరా వేడుకలు రేవంత్ రెడ్డి తన సొంతూర్లో చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, కొండారెడ్డిపల్లిలో నేడు సీఎం పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే రూ.30 కోట్లు మంజూరు కాగా.. మరో రూ.170 కోట్ల పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సుమారు రూ.72 లక్షలు పెట్టి నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి రేవంత్ తండ్రి ఎనుముల నరసింహారెడ్డి పేరు పెట్టారు.
రూ.45 లక్షలతో వెటర్నరీ హాస్పిటల్, రూ.70 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, రూ.39 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ రెనోవేషన్, రూ.25 లక్షలతో బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్, మోడ్రన్ బస్ షెల్టర్, పార్క్, ఓపెన్ జిమ్, రైతు వేదిక పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. సోలార్ విద్యత్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక కావడంతో గ్రామంలోని ప్రతి ఇంటికి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. డెవలప్‌మెంట్ పనులను దసరా రోజు సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com