REVANTH: మేం పాలకులం కాదు.. ప్రజా సేవకులం

REVANTH: మేం పాలకులం కాదు.. ప్రజా సేవకులం
X
సం­త్‌ శ్రీ సే­వా­లా­ల్‌ జయం­తి వే­డు­క­ల్లో పా­ల్గొ­న్న సీఎం

తె­లం­గాణ ప్ర­భు­త్వం ప్ర­జా­కేం­ద్రీ­కృత పరి­పా­ల­న­కు కట్టు­బ­డి ఉం­ద­ని, తాము పా­ల­కు­లు కా­ద­ని సే­వ­కు­ల­మ­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి స్ప­ష్టం చే­శా­రు. ప్ర­జ­లు తమకు అధి­కా­రం ఇచ్చిం­ది అధి­కార ప్ర­ద­ర్శన కోసం కా­ద­ని, సేవ చే­య­డా­ని­కి అవ­కా­శ­మి­చ్చా­ర­ని ఆయన పే­ర్కొ­న్నా­రు. హై­ద­రా­బా­ద్‌­లో­ని బం­జా­రా భవ­న్‌­లో ని­ర్వ­హిం­చిన సం­త్‌ శ్రీ సే­వా­లా­ల్‌ జయం­తి వే­డు­క­ల్లో పా­ల్గొ­న్న సీఎం, ప్ర­భు­త్వ లక్ష్యా­లు మరి­యు భవి­ష్య­త్‌ ప్ర­ణా­ళి­క­ల­ను వి­వ­రిం­చా­రు. తం­డాల అభి­వృ­ద్ధి ప్ర­భు­త్వ ప్ర­ధాన లక్ష్య­మ­ని పే­ర్కొ­న్న రే­వం­త్‌­రె­డ్డి, రా­ష్ట్రం­లో­ని అన్ని తం­డా­ల­కు బీటీ రో­డ్లు వే­యా­ల­ని అధి­కా­రు­ల­కు ఇప్ప­టి­కే ఆదే­శా­లు ఇచ్చి­న­ట్లు తె­లి­పా­రు. గ్రా­మీణ మరి­యు గి­రి­జన ప్రాం­తా­ల్లో మౌ­లిక వస­తు­లు మె­రు­గు­ప­డి­తే­నే సమ­గ్ర అభి­వృ­ద్ధి సా­ధ్య­మ­ని ఆయన అన్నా­రు. ప్ర­తి తం­డా­లో పా­ఠ­శాల భవ­నాల ని­ర్మా­ణా­ని­కి చర్య­లు తీ­సు­కో­వా­ల­ని సూ­చిం­చి­న­ట్లు చె­ప్పా­రు. వి­ద్య ద్వా­రా మా­త్ర­మే సా­మా­జిక మా­ర్పు సా­ధ్య­మ­వు­తుం­ద­ని, చదు­వు ఉన్న­ప్పు­డే కీలక పద­వు­లు దక్కు­తా­య­ని సీఎం అభి­ప్రా­య­ప­డ్డా­రు.

అభివృద్ధి బాటలో తండాలు

తండాలకు విద్యుత్‌ సరఫరా విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. సోలార్‌ ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ను అందించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. భూముల కొరత ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు, విద్యా సదుపాయాల కల్పనపై ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా ఆయా వర్గాలకు న్యాయం చేశామని, వివిధ వర్గాలను పరిపాలనలో భాగస్వాములను చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలు 17 శాతం ఉన్నప్పటికీ తమ ప్రభుత్వంలో 30 శాతం ప్రాతినిధ్యం కల్పించామని చెప్పారు. దళితులకు స్పీకర్‌, మంత్రి పదవులు ఇచ్చి సామాజిక సమానత్వాన్ని ఆచరణలో చూపించామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు.

సామాజిక న్యాయం దిశగా...

సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా ఆయా వర్గాలకు న్యాయం చేశామని, వివిధ వర్గాలను పరిపాలనలో భాగస్వాములను చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలు 17 శాతం ఉన్నప్పటికీ తమ ప్రభుత్వంలో 30 శాతం ప్రాతినిధ్యం కల్పించామని చెప్పారు. దళితులకు స్పీకర్‌, మంత్రి పదవులు ఇచ్చి సామాజిక సమానత్వాన్ని ఆచరణలో చూపించామని పేర్కొన్నారు.మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి అంశంపై స్పందిస్తూ, గెలుపు–ఓటమి అన్నింటికీ తానే బాధ్యత వహిస్తానని చెప్పారు. విపక్ష నేతలు ప్రజలను నిందించడం సరికాదని, ప్రజాస్వామ్యంలో తీర్పును గౌరవించడం అవసరమని అభిప్రాయపడ్డారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్న వ్యాఖ్యలను వక్రీకరించారని, తన ఉద్దేశ్యం సేవాభావమేనని సీఎం స్పష్టం చేశారు. మొత్తానికి, తండాల అభివృద్ధి నుంచి సామాజిక న్యాయం వరకు విభిన్న అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన దిశగా సాగుతోందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా సేవ చేయడమే తమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.

Tags

Next Story