CM Revanth Reddy : మళ్లీ ఢిల్లీకి సీఎం రేవంత్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 11 నుంచి 13 వరకూ రాజస్థాన్, ఢిల్లీ రాష్ర్టల్లో ముఖ్యమంత్రి పర్యస్తారు. ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం జైపూర్ వెళ్లి, వారి బంధువుల వివాహంలో పాల్గొననున్నారు. అనంతరం అటునుంచి ఆయన ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీ, క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం మాట్లాడనున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. కేబినేట్ విస్తరణపై సీనియర్ కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదని ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రెడ్డి వలస కాంగ్రెస్ నేతలకు ఎక్కువ పదవులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని... ఐతే.. పాత వారికే ఇవ్వాలని సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే సీఎం వలస నేతల పేర్లు ఢిల్లీకి సిఫారసు చేయగా.. హైకమాండ్ తిరస్కరించినట్టు సమాచారం. ఈసారైనా ఢిల్లీ టూర్‌తో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్‌కు తెరపడుతుందా? అన్నది తేలాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com