REVANTH: ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు

REVANTH: ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు
X
మార్చి 1 నుంచి పంపిణీ.. వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి

రేవంత్ సర్కార్ కొత్త రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మార్చి1న కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లో రేషన్‌ కార్డులు పంపిణీ చేయనున్నట్టు తెలిపింది.

ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్

తెలంగాణను 1 ట్రిలియన్‌ ఎకానమీగా మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను సరికొత్త ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తామని తెలిపారు. బయో ఆసియా సదస్సు-2025లో ఆయన పోల్గొన్నారు. ఏఐ సాయంతో వైద్య రంగం రూపురేఖలు మారుతున్నాయని, ఉపాధి కల్పనలో మిగతా రాష్ట్రాలకంటే ముందున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు వచ్చే కంపెనీల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం తెలిపారు. 'గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా హైదరాబాద్‌ మారింది. హైదరాబాద్‌లో ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీ రాబోతున్నాయి. నగరాన్ని సరికొత్త ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తాం. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్‌ ఎకానమీగా మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్యం.' అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సాయంత్రం ఢిల్లీకి రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ అధిష్ఠానంతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు నాలుగు సీట్లు అవకాశం ఉంది. మరోవైపు రేపు ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కలవనున్నారు.

Tags

Next Story