REVANTH: త్వరలో గ్రూప్-1 నియామక పత్రాలు: సీఎం రేవంత్

తెలంగాణలో త్వరలోనే గ్రూప్-1 ఉద్యోగాల నియామక పత్రాలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. ‘‘563 మంది గ్రూప్- 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ పని చేస్తోంది. దీన్ని రాజకీయ పునరావాసంగా మార్చదల్చుకోలేదు. అందుకే సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంను టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించాం’’ అన్నారు. " గ్రూప్ వన్ కూడా వాయిదా వెయ్యాలని ఎంతో ఫైట్ చేశారు… కానీ కోర్టులు కూడా నిర్వహించాలని చెప్పింది.. 2011 తరువాత గ్రూప్ వన్ నిర్వహించలేదు… త్వరలో 563 మంది గ్రూప్ వన్ అధికారులను తెలంగాణ అభివృద్ధికి గీటురాయి గా నిలవబోతున్నారు.. చిత్తశుద్ధి తో ఛైర్మెన్ మహేందర్ రెడ్డి పనిచేశారు.. ప్రస్తుతం బుర్రా వెంకటేశం నీ TGPSC ఛైర్మెన్ గా నియమించాం.. గతంలో RMP వైద్యున్ని TSPSC సభ్యుడిగా నియమించారు.. గతంలో రాజకీయ పునరావాస కేంద్రంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేశారు" . అని రేవంత్ వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com