REVANTH:నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి శుభవార్త

తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడదుల చేస్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం పిల్లలకు కోచింగ్ ఇప్పించాలని ఎస్సీ సంఘాల నేతలకు సూచించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎస్సీ సంఘాల నాయకులు సీఎంని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వర్గీకరణ పోరాటంలో అమరులైన వారికి నివాళిగా 2 నిముషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. 'మందకృష్ణతో నాకేం విబేధం లేదు. కానీ ఆయన నాకంటే కిషన్ రెడ్డిని ఎక్కువ నమ్ముతున్నాడు' అని సీఎం అన్నారు.
రేవంత్ ఆసక్తికర ట్వీట్
వర్గీకరణతో వాస్తవాలు బయటపడ్డాయంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. ప్రతి అడుగులో సామాజిక న్యాయం ఉట్టిపడుతోందని వెల్లడించారు. దశాబ్దాల నుంచి ప్రజలకున్న ఆకాంక్షలను సర్కార్ నెరవేరుస్తుందనే వాస్తవం వర్గీకరణతో రుజువైందని పోస్ట్‌లో రాసుకొచ్చారు.
రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట
సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగి పీఎస్లో 2020 మార్చిలో నమోదైన కేసును కోర్ట్ కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేశారని రేవంత్ రెడ్డి, మరికొంత మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఎఫ్ఎఆర్ క్వాష్ చేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఆయన న్యాయవాది జన్వాడ నిషిద్ధ ప్రాంతం కాదని చేసిన వాదనలు కోర్ట్ ఏకీభవించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com