REVANTH: గడువులోగా పనులు పూర్తి కావాలి: రేవంత్

REVANTH: గడువులోగా పనులు పూర్తి కావాలి: రేవంత్
X
చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించాలి... ముఖ్యమంత్రి ఆదేశాలు

చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించాలని విద్యాశాఖ అధికారులను CM రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ క్రమంలో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లకు స్థలాల సేకరణపై ఆయన ఆరా తీశారు. ‘ప్రతి నియోజకవర్గంలో స్కూళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడువులోగా పనులు పూర్తయ్యేలా చూడాలి. ’ అని అధికారులను రేవంత్ ఆదేశించారు. ‘కులగణన బాధ్యత నాపై, భట్టి విక్రమార్కపై ఉంది. బీహార్‌ సహా విఫలమైన రాష్ట్రాలను అధ్యయనం చేసి, ఓ ప్రణాళిక ప్రకారమే కులగణనపై ముందుకు వెళ్తున్నాం. 150 ఇళ్లను ఒక యూనిట్‌‌గా చేసి సర్వే చేశాం. చెట్ల మీద విస్తరాకులు కుట్టినట్టుగా KCR ఒక్కరోజే సర్వే నిర్వహించి కాకి లెక్కలు చూపించారు. ఆ లెక్కలే చూపిస్తూ మా సర్వే తప్పని అంటున్నారు. ’ అని మండిపడ్డారు.

సీఎం రేవంత్ బిగ్ స్కెచ్?

రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. BRS ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్న BRS ఎమ్మెల్యేలు ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి, చేరబోయే వారిలో మరో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలని అడుగుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

పాదయాత్ర చేయనున్న హరీష్ రావు

సంగారెడ్డి జిల్లాలోని సగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మాంత్రి హరీష్ రావు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి మెదక్ జిల్లా బీఅర్ ఏస్ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు హాజరయ్యారు.

Tags

Next Story