Congress : మహిళలు, రైతులపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వరాల జల్లు

Congress : మహిళలు, రైతులపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వరాల జల్లు
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వకుండా బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు

మహిళలు, రైతులపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 500 రూపాయలకే సిలిండర్ అందిస్తామన్నారు. మంత్రివర్గంలో నలుగురు మహిళలకు మంత్రి పదవులు ఇస్తామని, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.

హాత్‌ సే హాత్ జోడో యాత్రలో భాగంగా హన్మకొండ జిల్లాలో మహిళలతో మాటామంతి నిర్వహించారు. మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్న రేవంత్‌రెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ప్రధాని మోదీ మహిళా ద్వేశి అని.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వకుండా బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలో డ్వాక్రా గ్రూపులను కేసీఆర్ నిర్వీర్యం చేసారని విమర్శించారు. పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల వరకు వైద్య ఖర్చులను కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Tags

Next Story