Congress: నేడు మరో జాబితా విడుదల

Congress: నేడు మరో జాబితా విడుదల
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ , కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం

రాష్ట్రంలో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల ఏంపికపై కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ తుది నిర్ణయం తీసుకోనుంది. నిన్న సోనియా గాంధీతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిపాలన, అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముంబయిలో మొన్న రాత్రి సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించి పలు నియోజక వర్గాల్లో అభ్యర్ధుల ఎంపికపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించింది. AICC ప్రకటించిన మొదటి జాబితాలో రాష్ట్రానికి చెందిన జహీరాబాద్, మహబూబాబాద్ , నల్గొండ, మహబూబునగర్ లోకసభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన 13 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. 13 నియోజక వర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్న నాయకులపై కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ఇప్పటికే ఫ్లాష్ సర్వేలు నిర్వహించింది. సర్వేల వివరాలు ముంబయిలో ఆదివారం రాత్రి జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించింది. గెలుపే ప్రధానమన్న లక్ష్యంతో 13 లోకసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సామాజిక సమతుల్యత పాటిస్తూనే విజయం సాదించ గలిగే ప్రజాబలం కలిగిన వారికే టికెట్లు ఇచ్చే దిశలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ముందుకు వెళుతుంది. జనాదరణ కలిగిన నాయకులనే బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇవాళ సాయంత్రం దిల్లీలో జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ రాష్ట్రానికి చెందిన లోకసభ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుంది. AICC ప్రకటించనున్న నాలుగో జాబితాలో తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుందని PCC వర్గాలు చెబుతున్నాయి. ఈ రాత్రికి కానీ రేపు కానీ అభ్యర్థుల వివరాలను అధిష్టానం వెల్లడించే అవకాశముందని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story