గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ బీసీ నేతల సమావేశం

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ బీసీ నేతల సమావేశం
X

కాసేపట్లో టీ.పీసీసీ కార్యవర్గం సమావేశం కానుంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో భేటీ అవుతున్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావ్ ఠాక్రే, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ముఖ్యనేతలు హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్‌ నేతలు చర్చించనున్నారు. ఈ నెల 25న చేవెళ్లలో నిర్వహించనున్న కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే బహిరంగ సభపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆశావహుల నుంచి అభ్యర్థుల స్వీకరణ మొదలు పెట్టిన పీసీసీ... సర్వేల అధారంగా గెలుపు అవకాశాలు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేస్తోంది.

మరో వైపు గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ బీసీ నేతలు సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో పీసీసీ స్పష్టం చేయాలని కోరుతున్నారు. బీసీలకు కేటాయించిన సీట్లలో బీసీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటున్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలుకు బీసీ నేతలు పట్టుబడుతున్నారు. బీసీలకు తగినన్ని టికెట్లు కేటాయించేలా పీసీసీ, ఏఐసీసీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఎస్సీ, ఎస్టీ నేతలను ఢిల్లీకి పిలిపించి చర్చించన విధంగానే.. బీసీ నేతలను అధిష్ఠానం పిలిచి మాట్లాడాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌ బీసీ నేతల డిమాండ్లపై హైకమాండ్‌ ఎలా స్పందిస్తుందని ఆసక్తికరంగా మారింది.

Tags

Next Story