ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్
X

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మొదటి లిఫ్ట్‌ వద్ద నీట మునిగిన మోటర్లను సందర్శించేందుకు వెళ్లిన నేతల అరెస్టులను నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా నాగర్‌ కర్నూల్‌ ఆర్టీసీ డిపో వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకుని, పలు వ్యాపార సంస్థలను మూసివేయించే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags

Next Story