Huzurabad By Election: హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడువేల ఓట్లే.. ఎందుకు..?

Huzurabad By Election: హుజురాబాద్ ఎన్నికలో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమీక్ష సమావేశం వాడివేడిగా జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్ధి బల్మూరి వెంకట్‌కు మూడువేల ఓట్లే రావడానికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డే కారణమంటూ కాంగ్రెస్ సీనియర్లు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు.
మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో 34 శాతం ఓట్లు వచ్చిన కాంగ్రెస్‌కు.. ఈ ఎన్నికల్లో మూడువేల ఓట్లే రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఓటమికి గల కారణాలను అధిష్టానానికి నివేదిస్తానని చెప్పుకొచ్చారు.
మరోవైపు హుజురాబాద్ ఎన్నిక ఓ ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిందని, ఓటమికి మొత్తం బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ.. సీనియర్లు శాంతించడం లేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. అటు.. ఈ భేటీకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి హాజరు కాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com