Rahul Gandhi : ఉంటే ఉండండి... పోతే పొండి.. కాంగ్రెస్‌లో ఆ లీడర్లకు రాహుల్ అల్టిమేటమ్..!

Rahul Gandhi : ఉంటే ఉండండి... పోతే పొండి... పొత్తులు, గిత్తులని వెర్రి వేషాలేస్తే మాత్రం పార్టీ నుంచి బహిష్కరణే అంటూ.. కాంగ్రెస్ లీడర్లకు అల్టిమేటమ్ జారీ చేశారు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎంత పెద్ద నాయకులైనా సరే... పేదలు, రైతుల వెంట ఉన్నవారికే టికెట్లిస్తామని తేల్చి చెప్పారు. వరంగల్ సంఘర్షణ సభలో మాట్లాడిన రాహుల్.... తెలంగాణలో పొత్తంటూ ఉంటే.. అది బీజేపీ, TRSల మధ్యే అన్నారు. తామూ సింగిల్‌గానే KCRను గద్దె దించుతామన్నారు. ఇక రాష్ట్రప్రజలందరినీ మోసం చేసిన వ్యక్తితో కాంగ్రెస్‌కు ఏనాడూ పొత్తుండదన్నారు రాహుల్.
వరంగల్ గడ్డ మీది నుంచి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. తెలంగాణలో రాచరిక పాలన నడుస్తోందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రే ఉంటే ప్రజల మాట వినే వాడని... రాజు కాబట్టే నచ్చింది చేసుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏ ఒక్కరి కోసమే తెలంగాణ ఇవ్వలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.
రైతు సంఘర్షణ వేదికగా రైతులకు రుణమాఫీ, గిట్టుబాటు ధరపై భరోసా ఇచ్చిన రాహుల్ గాంధీ... అన్నదాతల ప్రతిపోరాటంలో వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు. ఇకపై రైతుల ప్రతిపోరాటంలో తాను అండగా ఉంటానన్నారు. తర్వాత ఆదీవాసీలకు కాంగ్రెస్ తన భరోసా ఇవ్వబోతోందన్నారు రాహుల్ గాంధీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com