CONGRESS: నేటి నుంచి కాంగ్రెస్ నేతల ఢిల్లీ యాత్ర

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమైంది. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో పార్టీ నేతలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి బయలు దేరుతున్నారు. మంగళవారం సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాటు బీసీ మంత్రులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీలో సమావేశమై రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంటులో చర్చ కోసం కాంగ్రెస్, మిత్ర పక్షాల ఎంపీలతో వాయిదా తీ ర్మానాలు ఇప్పించనున్నారు. ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి డి- ల్లీ కి ప్రత్యేక రైల్ లో బయలుదేరనున్నారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ ఉద్యమం చేయపట్టనున్నది. ప్రతి జిల్లా డీసీసీ ల నుంచి 25 మంది వెళ్లనున్నారు. ఆగస్టు 5 న పార్లమెంట్ లో తెలంగాణలో 42 శాతం బిసి రిజర్వేషన్ల అంశాలపై చర్చించేలా పార్లమెంటు లో వాయిదా తీర్మానం కోసం పోరాటం చేయనున్నది. బుధవారం జంతర్ మంతర్ వద్ద రేవంత్, మహేశ్ గౌడ్ నేతృత్వంలో జరిగే ధర్నాలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, బీన్ సంఘాల నాయకులు పాల్గొంటారు. అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు కాంగ్రెస్ మిత్ర పక్ష పార్టీల నాయకులు దీనికి సంఘీభావం తెలుపుతారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతి ముర్ముకు గురువారం వినతిపత్రం సమర్పించనున్నారు.
స్థానిక విజయం లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం
బిసి రిజర్వేషన్లు ప్రకటించినా...రాష్ట్రపతి ఇంకా ఆమోదించలేదు. దీనిపై కేంద్రాన్ని నిందిస్తూ కాంగ్రెస్ ఉద్యమకార్యాచరణకు సిద్దం అవుతోంది. ఢిల్లీలో ఆందోళన చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 42 శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. బిజెపి మాత్రం ఇది ఆమోదయోగ్యం కాదని చెబుతోంది. అందులో ముస్లిం రిజర్వేషన్లు తొలగించాలని చెబుతోంది. మొత్తంగా ఎవరి రాజకీయం వారిది. ఎవరి ఆలోచన వారిది. ఈ క్రమంలో ఆర్డినెన్స్ పాస్ కాకుంటే... మావ్యూహం మాకుందని సిఎం రేవంత్ పదేపదే చెబుతున్నారు. అదేంటన్నది ఇప్పుడే తెలియదు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం స్థానాల్లో విజయం సాధించాల్సిందేనని పట్టుదలతో కాంగ్రెస్ పనిచేస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు సందేశాలు వెళ్లాయి. మరోవైపు ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్ జూలై31 గురువారం నుంచి పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టు కుని ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకూ తొలి విడత పాదయాత్ర, పల్లె నిద్ర శ్రమదానం చేయడానికి త్రిముఖ వ్యూహాన్ని ఆమె ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి నిర్ణయించిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com