REVANTH: నేడు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభం

REVANTH: నేడు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
X
ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన

నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ చనాక కొరట పంపు హౌస్‌ను, అనంతరం నిర్మల్ జిల్లాలో సదర్ మట్ బ్యారేజీని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్మల్ మినీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఆది­లా­బా­ద్ జి­ల్లా­లో ని­ర్వ­హిం­చ­ను­న్న భారీ బహి­రంగ సభతో కాం­గ్రె­స్‌ ము­న్సి­ప­ల్‌ ఎన్ని­కల ప్ర­చా­రా­న్ని అధి­కా­రి­కం­గా ప్రా­రం­భిం­చ­బో­తోం­ది. ఈ సభతో పా­ర్టీ శ్రే­ణు­ల్లో ఉత్సా­హం నిం­ప­డం­తో పాటు, రా­బో­యే ఎన్ని­క­ల­పై స్ప­ష్ట­మైన సం­కే­తా­న్ని ప్ర­జ­ల­కు ఇవ్వా­ల­ని కాం­గ్రె­స్‌ భా­వి­స్తోం­ది. సీఎం రే­వం­త్‌­రె­డ్డి స్వ­యం­గా ప్ర­చార బా­ధ్య­త­లు చే­ప­ట్ట­డం­తో పా­ర్టీ శ్రే­ణు­ల్లో కొ­త్త జో­ష్‌ కని­పి­స్తోం­ది. ము­న్సి­ప­ల్‌ ఎన్ని­క­లు పా­ర్టీ గు­ర్తు­తో­నే జర­గ­ను­న్న నే­ప­థ్యం­లో కాం­గ్రె­స్‌ అన్ని ము­న్సి­పా­లి­టీ­ల్లో గె­లు­పే లక్ష్యం­గా వ్యూ­హా­లు రచి­స్తోం­ది. అభ్య­ర్థుల ఎం­పిక నుం­చి ప్ర­చార వి­ధా­నం వరకు ప్ర­తి అం­శం­పై పా­ర్టీ అం­త­ర్గ­తం­గా వి­స్తృత చర్చ­లు జరు­పు­తోం­ది. ప్ర­తి ము­న్సి­పా­లి­టీ­లో కాం­గ్రె­స్‌­ను గె­లి­పిం­చే బా­ధ్య­త­ను ము­ఖ్య­నే­త­ల­కు అప్ప­గిం­చ­ను­న్నా­రు.

పం­చా­య­తీ ఎన్ని­క­ల్లో రె­బె­ల్స్‌ కా­ర­ణం­గా కొ­న్ని­చో­ట్ల ప్ర­తి­ప­క్షా­లు లా­భ­ప­డ్డా­య­ని.. ము­న్సి­పా­లి­టీ­ల్లో అది పు­న­రా­వృ­తం కా­కుం­డా అన్ని జా­గ్ర­త్త­లు తీ­సు­కుం­టు­న్న­ట్లు సీ­ని­య­ర్‌ నా­య­కు­లు చె­ప్పా­రు. ప్ర­ధా­నం­గా స్థా­నిక నేతల మధ్య అభి­ప్రా­య­భే­దా­లు ఇతర పా­ర్టీ­ల­కు ఉప­యో­గ­ప­డ­కుం­డా ముం­ద­స్తు జా­గ్ర­త్త­లు తీ­సు­కో­వా­ల­ని పీ­సీ­సీ గట్టి ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఏ ము­న్సి­పా­లి­టీ­లో నేతల మధ్య సఖ్యత ఎలా ఉంది, ఎవరు ఎం­త­మం­ది అభ్య­ర్థు­ల­కు టి­క్కె­ట్లు ఇవ్వా­ల­ని కో­రు­తు­న్నా­ర­నే­ది ముం­దే చె­ప్పా­ల­ని కో­రిం­ది. ఒక్కో వా­ర్డు­కు ఐదు నుం­చి ఆరు­గు­రు ఆశా­వ­హు­ల­ను ఎం­పిక చే­యా­ల­ని సూ­చిం­చిం­ది.

Tags

Next Story