CONGRESS: జీహెచ్ఎంసీ "హస్త"గతానికి వ్యూహారచన

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సత్తా చాటిన జీహెచ్ఎంసీ ఎన్నికలను విజయం సాధించాలని భావిస్తోంది. ఈసారి ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పదేళ్లూ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన కాంగ్రెస్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే రెండేండ్లు గడిచిపోయాయి. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్సింగిల్డిజిట్కే పరిమితమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొలువుదీరాక మేయర్ విజయలక్ష్మి హస్తం గూటికి చేరారు. ఆమెతో పాటే చాలా మంది ఇతర పార్టీల కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మేయర్ కుర్చీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వశమైంది.
సమయం అసన్నమైనట్లేనా…?
తాజాగానే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వటమే కాక… మంచి మెజార్టీతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదన్న వాదనను తెరపైకి తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. అందుకు జూబ్లీహిల్స్ ఫలితాన్ని తెరపైకి తీసుకువస్తోంది. ఇదే విషయాన్ని పలువురు మంత్రులు, ముఖ్య నేతలు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ…. ఇక ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. అందులోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా పూర్తి చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో… ఇకపై ఆలస్యం కాకుండా ఎన్నికలు నిర్వహించాలని గట్టిగా భావిస్తోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికలు కీలకం..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పూర్తయింది. ఇక్కడ అధికార పార్టీ సత్తా చాటింది. అయితే, కొద్ది నెలల్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్కు కీలకంగా మారనున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్కు ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చిందని.. ఫలితంగా గెలుపు సునాయాసం అయ్యిందనే చర్చ జరుగుతున్నది. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లోనూ మజ్లిస్ మద్దతును కాంగ్రెస్తీసుకుంటుందా? అనే ఆసక్తికర చర్చ ప్రస్తుత రాజకీయ వర్గాల్లో మొదలైంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లీస్పార్టీ అక్కడ ఏకంగా ఐదు అసెంబ్లీ సీట్లను సాధించింది. ఎంఐఎం బరిలో నిలవడంతో ఆర్జేడీ, కాంగ్రెస్కూటమికి పడాల్సిన ముస్లిం ఓట్లు కాస్త మజ్లిస్ ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు కూడా ఎంఐఎంతో పొత్తు లేకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగితే ముస్లిం ఓట్లు చీలడం ఖాయం. జాతీయ స్థాయిలో మజ్లిస్పార్టీకి, కాంగ్రెస్కు సంబంధాలు అంతగా బాలేవు. కానీ, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్తో ఎంఐఎం మిత్రపక్షంగా వ్యవహారిస్తున్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

