MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్.. నేడు నామినేషన్స్..

MLC Elections (tv5news.in)
X

MLC Elections (tv5news.in)

MLC Elections: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది.

MLC Elections: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. ఇవాళ నామినేషన్లు వేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఖమ్మం నుంచి నాగేశ్వర్‌రావు, మెదక్‌ నుంచి జగ్గారెడ్డి, నల్గొండ నుంచి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్‌ నుంచి వాసుదేవరెడ్డి, నిజామాబాద్‌ నుంచి మహేష్‌ కుమార్‌ గౌడ్‌ను ఎంపిక చేసింది. ఢిల్లీ నుంచి అధిష్ఠానం బీ ఫారంలు పంపింది. ఏడుగురికి బీ ఫారంలు సిద్ధం చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.

రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ అభ్యర్థులపై పార్టీ కసరత్తు చేస్తోంది. మరోవైపు అభ్యర్థులు బరిలో నిలిస్తే బీఫారంలు ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. మొత్తం 12 స్థానాలకు 10 చోట్ల పోటీ చేయాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. స్థానిక బలాబలాల మేరకు బీ ఫారంలు ఇవ్వనున్నట్లు పార్టీ తెలిపింది. రేపు ఉదయం పోటీ చేయనున్న అభ్యర్థులను పీసీసీ అధికారికంగా ప్రకటించనుంది.

Tags

Next Story