Congress Rachabanda: తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం.. నెలరోజుల పాటు..

Congress Rachabanda: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. వరంగల్‌లో రాహుల్ ప్రకటించిన డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నెల రోజుల కార్యక్రమాలకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని.. ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతు డిక్లరేషన్‌పై గ్రామస్తులతో రేవంత్ ముఖాముఖి అయ్యారు. ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15వేల రూపాయల సాయం, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఇక ధరణి పోర్టల్ రద్దు చేస్తామని.. రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పంటలకు బీమా, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక చక్కరు కర్మాగారాలు తెరిపించడం లాంటి అంశాలపై రైతులతో చర్చించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com