Huzurabad By Election: హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీరే!

Huzurabad By Election: హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీరే!
X
Huzurabad By Election: హుజురాబాద్ బైపోల్ షెడ్యూల్ విడుదల కావడంతో అందరి దృష్టి ఈ ఎన్నిక మీదే ఉంది.

Huzurabad By Election: హుజురాబాద్ బైపోల్ షెడ్యూల్ విడుదల కావడంతో అందరి దృష్టి ఈ ఎన్నిక మీదే ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను ఖరారు చేశారు. టీఆర్ఎస్ నుండి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుండి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. అయితే మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థి వేటలోనే ఉంది. రేపు కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్టానం ప్రకటించే అవకాశముండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక కోసం ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు దామోదర రాజనర్సింహ నేతృత్వంలో కాంగ్రెస్ అధిష్టానం ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ ముగ్గురు పేర్లను సూచిస్తూ పీసీసీకి, ఏఐసీసీకి నివేదిక అందజేసింది. కొండా సురేఖ, మాజీ ఎంపీపీ సదానందం, కరీంనగర్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణా రెడ్డిల పేర్లను సూచించింది. దాదాపు కొండా సురేఖ పేరు ఖరారు చేసినట్టు ఊహాగానాలు వచ్చాయి. అయితే జిల్లా స్థానిక నేతలు కమిటీ రిపోర్ట్‌ను వ్యతిరేకించారని కొండా సురేఖ నాన్ లోకల్ కాబట్టి ఉపఎన్నికలే కాక సాధారణ ఎన్నికల్లో కూడా ఎఫెక్ట్ పడుతుందని చెప్పడంతో ఆమె పేరును పీసీసీ నేతలు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

మరోవైపు కరీంనగర్ జిల్లా లీడర్లు వ్యతిరేకించడంతో హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహలతో.. పీసీసీ మరో కమిటీ వేసింది. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 19 మందిలో మూడు పేర్లను రాజనర్సింహ, భట్టివిక్రమార్క నేతృంతంలోని కమిటీ ఏఐసీసీకి పంపినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆ పార్టీ కిసాన్ సెల్ నేత పత్తి కృష్ణారెడ్డి, బీసీ వర్గానికి చెందిన రమేష్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మాజీ మంత్రి కొండా సురేఖను బరిలో దింపే అంశంపైనా చర్చ జరుగోతంది.

Tags

Next Story