Congress Jana Jatara: తెలంగాణ మోడల్‌ను దేశానికి అందించడమే లక్ష్యం

Congress Jana Jatara: తెలంగాణ మోడల్‌ను దేశానికి అందించడమే లక్ష్యం
తుక్కుగూడ జన జాతర సభ అందుకే

తెలంగాణ మోడల్‌ను దేశానికి అందించాలన్న లక్ష్యంతోనే.. తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఆ సభ నుంచే కాంగ్రెస్ అధినాయకత్వం దేశానికి గ్యారంటీ ఇచ్చేలా మేనిఫెస్టోను ప్రకటించబోతుందని తెలిపింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్‌ని నిర్ణయించే ఎన్నికలన్న సీఎం.. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలువబోతున్నామని తెలిపారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారం చేపట్టడం తధ్యమని వివరించారు.

తుక్కుగూడ వేదికగా శనివారం జరగనున్న జనజాతర సభను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆ సభ వేదికగానే కాంగ్రెస్‌ జాతీయ మేనిఫెస్టో ప్రకటించనుండగా దేశాన్ని ఆకర్షించేలా తుక్కుగూడ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుక్కుగూడలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సభా ప్రాంగంణం మొత్తం కలియ తిరిగిన ఆయన. పలువురు మంత్రులు, ముఖ్యనేతలతో సమావేశమై..సభ విజయవంతంపై చర్చించారు. కాంగ్రెస్‌కి తెలంగాణలో ఉన్న పరిస్థితులే దేశవ్యాప్తంగా ఉన్నాయని.. కేంద్రంలో ఇండియాకూటమి అధికారంలోకి రాబోతోందని రేవంత్‌ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 14పార్లమెంట్‌ స్థానాల్లో గెలవబోతున్నామని.. కాంగ్రెస్‌ టికెట్లు పొందినవారు చాలా అదృష్టవంతులు అన్నారు. దేశంలో భాజపాపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా... ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీకి ఎదురులేదన్నట్లు కావాలనే అతిగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీల మాదిరిగానే.. దేశంలో ఐదు గ్యారంటీలు రాబోతున్నాయని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. జనజాతర సభకు పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక సహా... ఇతర జాతీయస్థాయి నేతలు హాజరుకానుండగా.. పటిష్ఠ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆ జనజాతర సభకు వచ్చేందుకుప్రజలు సిద్ధంగా ఉన్నారన్న మంత్రి శ్రీధర్‌బాబు.. ఆ సభ ద్వారా దేశానికి సంబంధించిన మేనిఫెస్టోను ప్రజల ముందు పెడతామని వెల్లడించారు..

తుక్కుగూడ జనసమీకరణపై నియోజకవర్గాల‌్లో మంత్రులు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు విస్తృతంగా సమావేశాలు నిర్వహించిన నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలోనికాంగ్రెస్ పాలన మోడల్‌నిదేశానికి అందించాలంటే..లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో హస్తం పార్టీని గెలిపించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క విజ్ఞప్తి చేశారు. దేశంలో మత కల్లోలం రేపుతూరాజకీయం చేస్తున్న భాజపాకు బుద్ధిచెప్పేలా కాంగ్రెస్‌కు అండగా ఉండాలని సూచించారు.

తుక్కుగూడ వేదికగా నిర్వహించే సభలో జాతీయ మేనిఫెస్టోలో 5 న్యాయ్‌లు, 25 గ్యాంరటీలను తెలుగులో ప్రకటించనున్నట్లు ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య తెలిపారు. ఆ సభను విజయవంతం చేయాలని యాదాద్రిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు. జనజాతరసభకు కార్యకర్తలు జనజాతరలా తరలిరావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించేందుకు శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story