CONGRESS: జూబ్లీహిల్స్‌ పోరు.. కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ..!

CONGRESS: జూబ్లీహిల్స్‌ పోరు.. కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ..!
X
కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న ఆ నలుగురు... హస్తం పార్టీకి ప్రతిష్టాత్మకంగా ఎన్నిక... \ఈసారి సత్తా చాటాలని రేవంత్ వ్యూహాలు

తె­లం­గా­ణ­లో మరో ఉప ఎన్నిక రా­జ­కీయ వేడి రా­జే­స్తోం­ది. జూ­బ్లీ­హి­ల్స్ ఎమ్మె­ల్యే మా­గం­టి గో­పీ­నా­థ్ మర­ణం­తో హై­ద­రా­బా­ద్‌­లో బై పోల్ అని­వా­ర్యం­గా మా­రిం­ది. ఆర్నె­ళ్ల­లో­పు ఎన్ని­క­లు జరి­గే అవ­కా­శం ఉం­డ­గా... ఈ ఉప ఎన్నిక ఏక­గ్రీ­వం కా­బో­తుం­దా? సి­ట్టిం­గ్ స్థా­నా­న్ని కా­పా­డు­కు­నేం­దు­కు బీ­ఆ­ర్ఎ­స్ ఎలాం­టి ఎత్తు­లు వే­య­బో­తుం­ది..? కం­టో­న్మెం­ట్ మా­ది­రి­గా కాం­గ్రె­స్ కై­వ­సం చే­సు­కో­నుం­దా?, బీ­జే­పీ, ఎం­ఐ­ఎం వ్యూ­హా­లేం­ట­నే­ది ఆస­క్తి­గా మా­రిం­ది. అయి­తే జూ­బ్లీ­హి­ల్స్ ఎమ్మె­ల్యే మృ­తి­తో ఖాళీ అయిన స్థా­నా­న్ని మళ్లీ వారి కు­టుం­బా­ని­కే ఇచ్చే అవ­కా­శం ఉంది. అయి­తే ఈ ఉప ఎన్ని­క­ల్లో ప్ర­ధాన పా­ర్టీ­లు పోటీ చే­స్తా­యా లేదా అన్న­ది మరింత ఉత్కం­ఠ­గా మా­రిం­ది. అయి­తే ఒక­వేళ ప్ర­ధాన పా­ర్టీ­లో బరి­లో­కి ది­గి­తే... అభ్య­ర్థు­లు­గా ఎవ­రి­ని పో­టీ­లో ని­లు­పు­తా­ర­నే దా­ని­పై­నా చర్చ జరు­గు­తోం­ది. ఆశా­వ­హు­ల­కు టి­కె­ట్లు దక్క­క­పో­తే వా­ళ్లు ఏ మే­ర­కు సహ­క­రి­స్తా­ర­నే చర్చ కూడా అప్పు­డే మొ­ద­లైం­ది. జూ­బ్లీ­హి­ల్స్‌­లో MIM ఓటు బ్యాం­క్ బలం­గా ఉంది. MIM­తో స్నే­హ­పూ­ర్వక ఒప్పం­దం ఉన్న నే­ప­థ్యం­లో ఈ సారి వా­ళ్ల మద్ద­తు­తో గె­ల­వా­ల­న్న ఆలో­చ­న­లో కాం­గ్రె­స్ పా­ర్టీ ఉంది. ఇలాం­టి చోట ఎలా­గై­నా గె­లి­చి BRS­ను ప్ర­జ­లు నమ్మ­డం లే­ద­ని ప్రూ­వ్ చే­యా­ల­ని సీఎం రే­వం­త్‌ భా­వి­స్తు­న్న­ట్లు సమా­చా­రం.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్

జూ­బ్లీ­హిల్స్ ఉపఎ­న్ని­క­ను కాం­గ్రె­స్ పా­ర్టీ ఎంతో ప్ర­తి­ష్టా­త్మ­కం­గా తీ­సు­కుం­టోం­ది. గ్రే­ట­ర్ పరి­ధి­లో­ని సీటు కా­వ­డం­తో ఈ ఎన్నిక ప్రా­ధా­న్యత సం­త­రిం­చు­కుం­ది. 2023 ఎన్ని­క­ల్లో గ్రే­ట­ర్ హై­ద­రా­బా­ద్‌­లో కాం­గ్రె­స్ ఒక్క సీటు కూడా గె­ల­వ­క­పో­వ­డం ఆ పా­ర్టీ­ని ఇబ్బం­ది పె­ట్టిం­ది. ఇప్పు­డు ఆ లో­టు­ను తీ­ర్చు­కో­వా­ల­న్న పట్టు­ద­ల­తో సీఎం రే­వం­త్ రె­డ్డి సా­ర­థ్యం­లో­ని కాం­గ్రె­స్ పా­ర్టీ జూ­బ్లీ­హి­ల్స్ ఉపఎ­న్ని­క­పై స్పె­ష­ల్ ఫో­క­స్ పె­ట్టిం­ది. ఉపఎ­న్ని­క­ల్లో కాం­గ్రె­స్ అభ్య­ర్థి­గా ఎవరు బరి­లో ది­గు­తా­ర­న్న దా­ని­పై ఆస­క్తి­కర చర్చ సా­గు­తోం­ది. ప్ర­స్తు­తం పా­ర్టీ లోపల మూడు పే­ర్లు ప్ర­ము­ఖం­గా వి­ని­పి­స్తు­న్నా­యి. మొ­ద­టి పేరు మహ్మ­ద్ అజా­రు­ద్దీ­న్.. గత ఎన్ని­క­ల్లో కాం­గ్రె­స్ తర­ఫున అదే స్థా­నం నుం­చి పోటీ చేసి ఓట­మి­పా­ల­య్యా­రు. ఇప్పు­డు మళ్లీ అవ­కా­శం ఇవ్వా­ల­ని కో­రు­తు­న్న­ట్లు సమా­చా­రం. తనకు హై­క­మాం­డ్ సపో­ర్ట్ కూడా ఉం­ద­ని ఆయన ప్ర­చా­రం చే­సు­కుం­టు­న్నా­రు. రెం­డొవ పేరు నవీ­న్ యా­ద­వ్.. గతం­లో MIM తర­ఫున జూ­బ్లి­హి­ల్స్ నుం­చి పోటీ చేసి.. ఎన్ని­క­ల­కు ముం­దు కాం­గ్రె­స్‌­లో­కి వచ్చిన నేత. మూడో పేరు వి­జ­యా­రె­డ్డి.. ఖై­ర­తా­బా­ద్ కా­ర్పో­రే­ట­ర్, పీ­జే­ఆ­ర్ కు­మా­ర్తె అయిన ఆమె కూడా రే­సు­లో ఉన్నా­రు. వీ­ళ్ల­తో పాటు మే­య­ర్ వి­జ­య­ల­క్ష్మి కూడా జూ­బ్లీ­హి­ల్స్‌ సీ­టు­పై ఆస­క్తి చూ­పు­తు­న్న­ట్టు సమా­చా­రం.

Tags

Next Story