CONGRESS: కేటీఆర్ అరెస్ట్ తథ్యం: టీపీసీసీ చీఫ్

CONGRESS: కేటీఆర్ అరెస్ట్ తథ్యం: టీపీసీసీ చీఫ్
X

జూ­బ్లీ­హి­ల్స్‌ ఉప ఎన్ని­క­లో కాం­గ్రె­స్‌ పా­ర్టీ­దే వి­జ­య­మ­ని టీ­పీ­సీ­సీ చీ­ఫ్‌ మహే­ష్‌ కు­మా­ర్‌ గౌ­డ్‌ చె­ప్పు­కొ­చ్చా­రు. సర్వే­లో ఎవరు ముం­దుం­టే వా­రి­కే సీటు అని క్లా­రి­టీ ఇచ్చా­రు. కల్వ­కుం­ట్ల కవి­త­ది ఆస్తుల పం­చా­య­తీ.. ఆమె­కు ప్ర­జ­ల్లో ఏం ఇమే­జ్‌ ఉం­ద­ని ప్ర­శ్నిం­చా­రు. ఫా­ర్ము­లా ఈ రేసు కే­సు­లో కే­టీ­ఆ­ర్‌ అరె­స్ట్‌ తప్ప­దు అంటూ ఆస­క్తి­కర వ్యా­ఖ్య­లు చే­శా­రు. ఫోన్ ట్యా­పిం­గ్ చేసి కే­సీ­ఆ­ర్, కే­టీ­ఆ­ర్ ఎన్ని­క­ల్లో గె­లి­చా­ర­ని వి­మ­ర్శిం­చా­రు. కో­మ­టి­రె­డ్డి రా­జ­గో­పా­ల్‍రె­డ్డి వి­ష­యం ఏఐ­సీ­సీ పరి­ధి­లో ఉం­ద­ని సరైన సమ­యం­లో సరైన ని­ర్ణ­యం అధి­ష్టా­నం తీ­సు­కుం­టుం­ద­న్నా­రు. సం­క్షే­మం, అభి­వృ­ద్ధే లక్ష్యం­గా పని చే­స్తు­న్నా­మ­న్నా­రు. డీ­సీ­సీల అం­శం­పై సమా­వే­శం­పై రా­హు­ల్ గాం­ధీ­తో చర్చించామన్నారు. ఈ సమా­వే­శా­ని­కి ఏఐ­సీ­సీ కొ­త్త­గా ఎం­పిక చే­సిన 22 మంది అబ్జ­ర్వ­ర్లు హా­జ­ర­య్యారన్నారు.

బీసీ రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో కృషి: సీఎం

తె­లం­గా­ణ­లో బీసీ రి­జ­ర్వే­ష­న్ల­ను 42 శా­తా­ని­కి పెం­చి అమలు కోసం చి­త్త­శు­ద్ధి­తో కృషి చే­స్తు­న్నా­మ­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి తె­లి­పా­రు. బి­హా­ర్‌­లో­ని పట్నా­లో జరి­గిన కాం­గ్రె­స్‌ వర్కిం­గ్‌ కమి­టీ సమా­వే­శం­లో రే­వం­త్ పా­ల్గొ­న్నా­రు. సీ­ఎం­తో పాటు కమి­టీ శా­శ్వత ఆహ్వా­ని­తు­లు మం­త్రి దా­మో­ద­ర్‌ రా­జ­న­ర్సింహ, పా­ర్టీ రా­ష్ట్ర వ్య­వ­హా­రాల ఇన్‌­ఛా­ర్జి మీ­నా­క్షీ నట­రా­జ­న్, పీ­సీ­సీ అధ్య­క్షు­డు మహే­శ్‌­కు­మా­ర్‌­గౌ­డ్‌ సమా­వే­శం­లో పా­ల్గొ­న్నా­రు. రా­హు­ల్‌ గాం­ధీ ఇచ్చిన ‘ఓట్‌ చో­ర్‌- గద్దీ ఛో­డ్‌’ ని­నా­దం­తో చే­ప­ట్టిన కా­ర్య­క్ర­మా­న్ని తె­లం­గా­ణ­లో­ని అన్ని ప్రాం­తా­ల్లో వి­జ­య­వం­తం­గా ని­ర్వ­హిం­చి­న­ట్లు రే­వం­త్‌­రె­డ్డి తె­లి­పా­రు. బీ­సీ­ల­కు 42 రి­జ­ర్వే­ష­న్ల అమ­లు­కు రా­ష్ట్ర ప్ర­భు­త్వం చే­ప­ట్టిన చర్యల గు­రిం­చి రే­వం­త్ సమా­వే­శం­లో వి­వ­రిం­చా­రు.

కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు

తె­లం­గాణ రా­ష్ట్రం­లో రా­ను­న్న రెం­డు రో­జుల పాటు భారీ వర్షా­లు కు­రు­స్తా­య­నే వా­తా­వ­రణ శాఖ అం­చ­నాల నే­ప­థ్యం­లో అధి­కా­రు­ల­ను ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి అప్ర­మ­త్తం చే­శా­రు. అన్ని కలె­క్ట­ర్లు హై అలె­ర్ట్ గా ఉండి పరి­స్థి­తి­ని సమీ­క్షిం­చా­ల­ని సూ­చిం­చా­రు. అవ­స­ర­మై­తే ముం­దు­గా­నే ప్ర­జ­ల­ను ఖాళీ చే­యిం­చి, పు­న­రా­వాస కేం­ద్రా­ల­ను తర­లిం­చా­ల­ని సూ­చిం­చిం­ది. అన్ని కాజ్ వే­ల­ను పరి­శీ­లిం­చి రో­డ్ల­పై­కి వరద నీరు ని­లి­చే ప్రాం­తా­ల­ను గు­ర్తిం­చి ముం­ద­స్తు­గా ట్రా­ఫి­క్ ను ని­లి­పి­వే­యా­ల­న్నా­రు. వి­ద్యు­త్ శాఖ ప్ర­త్యేక శ్ర­ద్ధ తీ­సు­కు­ని అం­త­రా­యం లే­కుం­డా కరెం­ట్ సర­ఫ­రా ఉం­డే­లా చర్య­లు చే­ప­ట్టా­ల­న్నా­రు. వే­లా­డే వై­ర్ల­ను తొ­ల­గిం­చ­డం­తో పాటు, ఎలాం­టి ప్రా­ణా­పా­యం జర­గ­కుం­డా చూ­డా­ల­న్నా­రు. దసరా సె­ల­వు­లు ఉన్న­ప్ప­టి­కీ వి­ద్యా­సం­స్థ­లు కూడా వర్షాల పట్ల అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­న్నా­రు. వర్షం సమ­యం­లో జనం రో­డ్ల­పై­కి రా­వొ­ద్ద­ని సూ­చిం­చా­రు. హై­ద­రా­బా­ద్‌­లో జీ­హె­చ్‌­ఎం­సీ, హై­డ్రా­తో పాటు, ఎన్డీ­ఆ­ర్‌­ఎ­ఫ్, ఎస్డీ­ఆ­ర్‌­ఎ­ఫ్ బృం­దా­లు అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని ఆదే­శిం­చా­రు.

Tags

Next Story