Bandi Sanjay : బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్.. బండి సంజయ్‌తో కలిసి ఢిల్లీ టూర్..

Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ని కలిశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఢిల్లీ వెళ్తున్న బండి సంజయ్‌తో కలిసి.. దాసోజు శ్రవణ్ కూడా ప్రయాణించారు.
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తరువాత.. ఏ పార్టీలో చేరుతున్నారో ఇప్పటి వరకు ప్రకటించలేదు. బీజేపీ వైపే వెళ్లొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ ఇవాళ బండి సంజయ్‌ని కలిశారు. బండి సంజయ్ ద్వారా దాసోజు శ్రవణ్.. ఢిల్లీ బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ బీజేపీ అగ్రనేతలను కలుస్తున్నారు బండి సంజయ్. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుస్తారు. ఇదే సందర్భంలో దాసోజు శ్రవణ్‌ను కూడా వెంట తీసుకెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక మునుగోడులో ఉప ఎన్నికపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్న బండి సంజయ్.. ఇతరత్రా అంశాలపైనా కేంద్ర బీజేపీ పెద్దలకు రిపోర్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్రమంత్రి అమిత్‌షాను కలిశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం అమిత్‌షాతో చర్చించారు. ఇవాళ దాసోజు శ్రవణ్‌ను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు బండి సంజయ్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు బండి సంజయ్ ఇవాళ పాదయాత్రకు విరామం ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com