Congress Leader : సినిమాల్లోకి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

తాను త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు. ఓ ప్రేమ కథా చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. ‘మాఫియాను ఎదిరించి ఓ ఆడపిల్లకు పెళ్లి చేసే క్యారెక్టర్‌లో కనిపిస్తా. ఈ ఉగాదికి మూవీ స్క్రిప్ట్ వింటా. వచ్చే ఉగాదికి సినిమాను పూర్తి చేస్తాం. పీసీసీ, సీఎం అనుమతి తీసుకొని నటిస్తా. ‘జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశాం’ అని పేర్కొన్నారు. ఇక, తాజాగా జగ్గారెడ్డి పోస్టర్లను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి వద్ది రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. జగ్గారెడ్డి సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజకీయాల నుంచి కొంత రిలాక్స్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాలపై ఆసక్తితో ఉన్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. తాజాగా జగ్గారెడ్డి మాట్లాడుతూ..‘నాకు సినిమా ఆఫర్ వచ్చింది. లవ్‌స్టోరీ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేస్తున్నాను. ప్రేమికుల ప్రేమను కాపాడే క్యారెక్టర్‌లో జగ్గారెడ్డి కనిపిస్తాడు. మాఫీయాను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసే నాయకుడి పాత్ర పోషిస్తున్నాను. రాజకీయాల్లో ఉంటా.. సినిమాల్లో కూడా ఉంటాను. రాజకీయాల్లో నన్ను ఎవరూ తొక్కలేరు. నా ఒరిజినల్ క్యారెక్టర్ సినిమాలో చూస్తారు. ఉగాదికి సినిమా కథ విని వచ్చే ఉగాదికి సినిమా పూర్తి చేస్తాను. పీసీపీ, ముఖ్యమంత్రికి చెప్పి సమయం తీసుకుని ఏడాది పాటు సినిమాలో నటిస్తాను అని చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com