Rahul Gandhi : టీఆర్ఎస్ తో మాకు పొత్తు ఉండదు.. తేల్చిచెప్పిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : నా అవసరం ఎక్కడున్నా.. ఎప్పుడున్నా… మీ దగ్గరికొచ్చి మీతో కసిలి పోరాడుతా..
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నేను కృషి చేస్తా
రైతులు, పేదలకు అండగా నిలవని వారెవరికీ టికెట్లు దక్కవు
తెలంగాణను మోసం చేసి వేల కోట్లు దోచుకున్న వ్యక్తిని మేము క్షమించం
రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ ను ఓడగొట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
మేము సాగిస్తున్నది మా సైద్ధాంతిక పోరాటం…
అలాంటి వ్యక్తుల అవసరం మాకు ఏ మాత్రం లేదు
ఎవరైనా పొత్తు కావాలనుకుంటే వారు టీఆర్‌ఎస్‌లోకి లేదా బీజేపీలోకి వెళ్లిపోవచ్చు
అతను ఎంత పెద్ద నాయకుడైనా సరే.. పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సిందే
ఒకవేళ ఏ కాంగ్రెస్ నేత అయినా ఈ ప్రశ్న లేవనెత్తితే అతణ్ని పార్టీ నుంచి బహిష్కరిస్తాం
తెలంగాణను మోసం చేసిన వ్యక్తితో కాంగ్రెస్ ఎలాంటి పొత్తు కుదుర్చుకోదు
తెలంగాణలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నది ఎవరు…?
తెలంగాణకు ఎవరు ద్రోహం చేశారని నేను మిమ్ముల్ని అడిగాను
రైతులే తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక లాంటి వారు
రైతులు బలహీనంగా ఉంటే తెలంగాణ స్వప్నాలు నెరవేరవని మాకు తెలుసు
తెలంగాణలోని ప్రతి రైతు ఈ డిక్లరేషన్ చదవాలి
ఇది కేవలం డిక్లరేషన్ కాదు.. రైతులకు కాంగ్రెస్ ఇచ్చే భరోసా
రేవంత్ రెడ్డి ఇప్పుడే వరంగల్ డిక్లరేషన్ గురించి చెప్పారు...
ఇవి వట్టి మాటలు కావు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పూర్తి చేసే మాటలు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షణ రుణమాఫీ చేస్తుంది
తెలంగాణ రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
పత్తి, మిర్చి రైతులకు కనీస మద్ధతు ధర అందడం లేదు
ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారుల మాటలు మాత్రమే వింటూ రైతులను విస్మరిస్తున్నారు
మీ ముఖ్యమంత్రి మాత్రం రైతుల మాటలు వినడం లేదు
మేము ప్రజల మాటను గౌరవించి.. వారు చెప్పినట్లే చేశాం
రుణమాఫీ అవసరముందని రైతులే మాతో చెప్పారు… అలాగే మద్ధతు ధర కూడా కోరారు
మొదటిది రుణమాఫీ.. రెండోది వరికి రూ. 2500 మద్ధతు ధర
చత్తీస్‌గఢ్‌లో మా ప్రభుత్వం ఉంది. అక్కడ మేము రెండు హామీలు ఇచ్చాం
కానీ రాజు అనేవాడు తన ఇష్టం వచ్చిన నిర్ణయాలు అమలు చేస్తాడు
ముఖ్యమంత్రి ప్రజల మాటలు వింటాడు... వారిలో నమ్మకం కలిగిస్తాడు
రాజు తాను అనుకున్నది చేసుకుంటూ వెళ్లిపోతాడు
ముఖ్యమంత్రి ప్రజల మాట వింటాడు.. రాజు ప్రజల మాట వినడు
తెలంగాణలో పేరుకు మాత్రమే సీఎం ఉన్నారు.. కానీ ఆయన సీఎం కాదు… రాజు...
కానీ ప్రజల ప్రభుత్వం ఏర్పడలేదని ఇప్పుడు అర్థమవుతోంది
తెలంగాణ ప్రజలు, రైతులు, కార్మికులు, పేదల ప్రభుత్వం ఏర్పడుతుందని భావించారు
ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యుల ఆవేదనకు ఎవరు బాధ్యత వహిస్తారు
నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, రైతుల్లో అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు
ఒక కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరుతోంది
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కన్న కలలన్నీ ఏమయ్యాయి
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఏ ఒక్కరిదో కాదు.. రాష్ట్రంలోని ప్రజలందరిది
తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి కోసమో ఏర్పడలేదు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఎందరో యువకులు, మహిళలు రక్తాన్ని ధారబోశారు
ఎర్రజొన్నకు మద్ధతు ధరను రూ. 3 వేలకు పెంచుతాం
పత్తి మద్ధతు ధరను రూ. 6500 కు పెంచుతాం
పసుపు క్వింటాల్ కు రూ. 15 వేలు ధర చెల్లిస్తాం
మిర్చి క్వింటాల్ కు రూ. 15 వేల ధర చెల్లిస్తాం
కందులకు మద్ధతు ధర రూ. 6700 కు పెంచుతాం
మొక్కజొన్నకు రూ. 2200 మద్ధతు ధర చెల్లిస్తాం
రూ. 2 వేల 500 క్వింటాల్ వడ్లు కొంటాం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com