SLBC: ప్రమాద ఘటనపై రాహుల్‌గాంధీ ఆరా

ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఘటనాస్థలిలో జరుగుతున్న సహాయక చర్యలపై రాహుల్ గాంధీ ఆరా తీశారు. 20 నిమిషాల పాటు రేవంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన తీరు, రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్‌ఎల్బీసీ ప్రమాద ఘటనా స్థలంలో కార్మికులను రక్షించేందుకు జరుగుతున్న సహాయక చర్యలపై రాహుల్ ఆరా తీశారు. కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చే వరకూ ప్రయత్నం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.
రాహుల్‌కు వివరించిన రేవంత్
ఘటన జరిగిన వెంటనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఘటనాస్థలికి వెళ్లారని రాహుల్‌కు రేవంత్ తెలిపారు. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయనీ వివరించారు. మరోవైపు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో వద్ద సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో 24 మందితో కూడిన ఆర్మీ బృందం పాల్గొందని తెలిపారు. ఘటనాస్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది.
ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాహుల్
SLBC టన్నెల్ లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది 14 కి. మీ లోపల చిక్కుకున్నారు. ఈ ప్రమాదంపై ృ-రాహుల్ గాంధీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 'ఈ ప్రమాదం నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు NDRF బృందాలు లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం అందింది." అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com