Jangaon: జనగామ ఇష్యూలో రెండుగా చీలిన కాంగ్రెస్..

Jangaon (tv5news.in)

Jangaon (tv5news.in)

Jangaon: జనగామ జిల్లా కాంగ్రెస్ లో ఇన్ని రోజులు అంతర్గతంగా నడిచిన కుమ్ములాటలు ఇప్పుడు రాష్ట్ర స్థాయి వరకు వెళ్లాయి.

Jangaon: జనగామ జిల్లా కాంగ్రెస్ లో ఇన్ని రోజులు అంతర్గతంగా నడిచిన కుమ్ములాటలు ఇప్పుడు రాష్ట్ర స్థాయి వరకు వెళ్లాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలు రెండుగా చీలిపోయి ఫైటింగ్ ను మరింత రక్తి కట్టిస్తున్నారు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.. జనగామ నియోజకవర్గం నుంచి అనేక పర్యాయాలు గెలుస్తూ వచ్చిన పొన్నాల లక్ష్మయ్య.. అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ మంత్రిగా కూడా పని చేశారు.

పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న పొన్నాల పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే 2014, 2018లో రెండుసార్లు వరుసగా ఓటమిపాలయ్యారు. దీంతో నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టడం మానేశారు. పొన్నాల లక్ష్మయ్య తరువాత పీసీసీ పగ్గాలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి.. పొన్నాలకు కొద్దిగా గ్యాప్ ఏర్పడింది. దీంతో ఉత్తమ్.. జనగామ కేంద్రంగా పొన్నాలకు కౌంటర్ పాలిటిక్స్ ను స్టార్ట్ చేశారు.

పొన్నాల లక్ష్మయ్య ప్రమేయం లేకుండా నాన్-లోకల్ గా ఉన్న జంగా రాఘవరెడ్డిని జనగామ జిల్లా అధ్యక్షుడిగా నియమించాడు. డీసీసీగా నియామకం తరువాత జంగా రాఘవరెడ్డి జనగామపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఇక తానే అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. పీసీసీగా ఉన్న ఉత్తమ్ అండదండలు జంగాకు ఉండటంతో అక్కడ పొన్నాలను డమ్మీ చేయడం మొదలైంది.

ఇక తాజాగా నియోజకవర్గంలో మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను జంగా రాఘవరెడ్డి.. పొన్నాల ప్రమేయం లేకుండా అంతా తన వర్గం వారిని నియమించుకున్నారు. దీంతో ఈ పంచాయితీ కొత్త పీసీసీ బాస్ రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. అయితే రేవంత్.. జంగా చేపట్టిన నియామకాలను రద్దు చేసి.. కొత్తగా పొన్నాల ఇచ్చిన లిస్ట్ ను ఫైనల్ చేశారు. దీంతో ఇరు వర్గాల పంచాయితీ ముదిరి పాకాన పడింది.

తాజాగా పార్టీ శిక్షణా తరగతులలో జంగా వర్గీయులు గొడవకు దిగడంతో ఇష్యూ కాస్తా సీరియస్ అయ్యింది. ఈ అంశాన్ని పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించారు. సమావేశంలో మెజారిటీ నాయకులు జంగా రాఘవరెడ్డి చర్యను క్రమశిక్షణ రాహిత్యంగా అభిప్రాయ పడ్డారు. ఇక ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చేందుకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

జంగా రాఘవరెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి ఒక అడుగు ముందుకేసి.. జంగాకు షోకాజ్ నోటీసు ఇస్తే తాను పార్టీకి రాజీనామా చేస్తానని అల్టిమేటం ఇచ్చారు. వెంకట్ రెడ్డి మాటలతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. అయితే పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇలాంటి బెదిరింపులకు తలోగ్గుతుందా? లేక కఠిన నిర్ణయం తీసుకుంటుందా? ఇదే ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది.

Tags

Read MoreRead Less
Next Story