CONGRESS:కేసీఆర్.. జనంలోకి రా: కాంగ్రెస్

CONGRESS:కేసీఆర్.. జనంలోకి రా: కాంగ్రెస్
X
కేసీఆర్‌ గర్జనలు గమనిస్తున్నామన్న పొంగులేటి... అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్న

నేను కొడితే మాములుగా ఉండదంటూ మాజీ సీఎం, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. కేసీఆర్‌ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామన్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లోనే ఉండి మాట్లాడతారా.. అసెంబ్లీకి కూడా వస్తారా? అని సెటైర్లు వేశారు. ప్రతిపక్ష నేత అంటే ప్రజల్లో తిరగాలని, ప్రజా సమస్యలు ప్రస్తావించాలన్నారు. వరదలొచ్చినప్పుడు కూడా కేసీఆర్ ప్రజలను పరామర్శించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ మాటలు చెప్పడం కాదని.. ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. "ప్రతిపక్ష హోదా ఇచ్చాం. కారు ఇచ్చాం. అయినా కేసీఆర్ బయటకు రారా.." అని మల్లు రవి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోల్ ను బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం జిమ్మిక్కులతో మార్చేసిందని మల్లు రవి ఆరోపించారు.


కేసీఆర్ మీకు ఇవి కనిపించడం లేదా: కాంగ్రెస్

రేవంత్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నాస్త్రాలు సంధించింది. కాంగ్రెస్‌ ఏడాది పాలనలో 50 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయడం కనిపించడం లేదా? అని నిలదీసింది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరికి బోనస్‌, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ది కాదా అని ప్రశ్నించింది. 40 లక్షల వరకు రేషన్‌ కార్డులు ఇస్తోంది హస్తం పార్టీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించింది.

జగ్గారెడ్డి ఫైర్

కేసీఆర్‌ని రేవంత్ అసెంబ్లీకి రండి అని అడిగారని... ప్రతిపక్ష నేత సభ పెట్టు అనాలని.. కానీ ఇక్కడ రివర్స్ ఉందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. “సీఎం… ప్రతి పక్ష నేతను సభకు రండి అని అడుగుతున్నారు. స్పీకర్ కూడా అదే అడుగుతున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్.. ఇంటి నుంచి బయటకు రారని... ఎవరు వచ్చినా.. ఆయన ఇంటి దగ్గరకే రావాలని... అసెంబ్లీకి రారని అన్నారు. అసెంబ్లీని మీ ఇంటికి తీసుకు రావాలా కేసీఆర్ అని ప్రశ్నించారు.

Tags

Next Story