CONGRESS: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్‌కు రిఫరెండమా...?

CONGRESS: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్‌కు రిఫరెండమా...?
X
స్థా­నిక సం­స్థల ఫలి­తా­లు కాం­గ్రె­స్ ప్ర­భు­త్వ పని­తీ­రు­కు రె­ఫ­రెం­డం­గా భా­వి­స్తు­న్నా­ర­న్న చర్చ

తె­లం­గాణ స్థా­నిక సం­స్థల ఎన్ని­కల నగరా మో­గిం­ది. ఇప్ప­టి­కే నా­మి­నే­ష­న్ల పర్వం కొ­న­సా­గు­తోం­ది. స్థా­నిక సం­స్థల ఫలి­తా­లు కాం­గ్రె­స్ ప్ర­భు­త్వ పని­తీ­రు­కు రె­ఫ­రెం­డం­గా భా­వి­స్తు­న్నా­ర­న్న చర్చ సా­గు­తోం­ది. తె­లం­గా­ణ­లో కాం­గ్రె­స్ పా­ర్టీ అధి­కా­రం­లో­కి వచ్చాక తొ­లి­సా­రి స్థా­నిక సం­స్థల ఎన్ని­కల ని­ర్వ­హ­ణ­కు సి­ద్ధ­మైం­ది. లో­క­ల్‌ బా­డీ­స్‌ ఎన్ని­క­ల్లో­నే బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్ ఇవ్వా­ల­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి భా­విం­చా­రు. రా­హు­ల్ గాం­ధీ ఆదే­శాల మే­ర­కు ఈ ఎన్ని­క­ల్లో­నే దీ­న్ని అమలు చే­స్తా­మ­ని టీ­పీ­సీ­సీ చీఫ్ మహే­ష్ గౌడ్ కూడా చె­ప్తూ వచ్చా­రు. ఈ ఎన్ని­క­ల్ని రా­ష్ట్రం­లో­ని అన్ని రా­జ­కీయ పా­ర్టీ­లు ప్ర­తి­ష్టా­త్మ­కం­గా తీ­సు­కుం­టు­న్నా­యి. ప్ర­ధా­నం­గా అధి­కా­రం­లో ఉంది కా­బ­ట్టి కాం­గ్రె­స్‌ పా­ర్టీ­కి ఈ గె­లు­పు చాలా ము­ఖ్య­మ­న్న అభి­ప్రా­యం బలం­గా ఉంది. అం­త­కు మిం­చి ఈ ఎన్ని­క­లు రెం­డే­ళ్ల కాం­గ్రె­స్‌ పా­ల­న­కు గీటు రా­యి­గా భా­విం­చా­ల్సి ఉం­టుం­ద­న్న చర్చ­లు సైతం నడు­స్తు­న్నా­యి. ఇప్ప­టి­వ­ర­కు ప్ర­భు­త్వం హా­మీల అమలు వి­ష­యం­లో అవ­కా­శం ఉన్న మే­ర­కు సీ­రి­య­స్‌­గా ప్ర­య­త్ని­స్తోం­ద­న్న ఫీ­లిం­గ్‌ ఉంది.

ఇప్ప­టి­వ­ర­కు జరి­గిన ఎన్ని­క­ల్ని చూ­సు­కుం­టే…

ఇప్ప­టి­కే సీఎం రే­వం­త్‌­రె­డ్డి గ్రౌం­డ్‌ లె­వ­ల్‌­లో ఏం జరు­గు­తోం­ద­న్న ఫీడ్ బ్యా­క్ తె­ప్పిం­చు­కు­నే వి­ష­యం­లో సీ­రి­య­స్‌­గా ఉన్నా­రు. ప్ర­తి­ప­క్షం యూ­రి­యా అం­శా­న్ని రే­వం­త్ ప్ర­భు­త్వ వై­ఫ­ల్య­మే అన్న­ట్టు చూ­పిం­చే ప్ర­య­త్నం చే­సిం­ది. దాని ప్ర­భా­వం ప్ర­భు­త్వం మీద ఉం­టుం­ద­న్న­ది ప్ర­తి­ప­క్షం లె­క్క. అదే సమ­యం­లో ఇప్ప­టి­వ­ర­కు జరి­గిన ఎన్ని­క­ల్ని చూ­సు­కుం­టే… స్థా­నిక సం­స్థల ఎన్ని­క­లు… అధి­కా­ర­పా­ర్టీ­కి అను­కూ­లం­గా­నే ఉం­టు­న్నా­యి. ఈ ఫలి­తా­లు తేడా రా­కుం­డా.. మం­త్రు­ల­ను బా­ధ్యు­ల­ను చే­యా­ల­ని పా­ర్టీ భా­వి­స్తోం­ది. తాజా రా­జ­కీయ పరి­స్థి­తుల నే­ప­థ్యం­లో అన్ని పా­ర్టీ­లు ఈ లో­క­ల్ బాడీ ఎన్ని­క­లు చా­లెం­జ్ గా మా­రా­యి. ము­ఖ్యం­గా బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ­కి బిగ్ చా­లెం­జ్‍గా ని­ల­వ­ను­న్నా­యి. గత అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో, పా­ర్ల­మెం­ట్ ఎన్ని­క­ల్లో దె­బ్బ­తి­న్న ఆ పా­ర్టీ.. లో­క­ల్‍లో సత్తా చా­ట­డం ద్వా­రా బౌ­న్స్ బ్యా­క్ కా­వా­ల­ని చూ­స్తోం­ది. ఈ మే­ర­కు ప్ర­భు­త్వ వై­ఫ­ల్యా­లే ప్ర­ధాన ఎజెం­డా­గా ప్ర­జ­ల్లో­కి వె­ళ్లేం­దు­కు పా­వు­లు కదు­పు­తోం­ది. అయి­తే ఈ ఎన్ని­క­ల్లో బీ­ఆ­ర్ఎ­స్ ను రా­ష్ట్ర రా­జ­కీ­యా­ల్లో రౌం­డ­ప్ చే­సేం­దు­కు ఈ ఎన్ని­క­లే కీ­ల­కం అని కాం­గ్రె­స్ భా­వి­స్తోం­ది. ఈ మే­ర­కు వ్యూ­హా­త్మ­కం­గా ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి ప్ర­ణా­ళి­క­లు వే­స్తు­న్న­ట్లు చర్చ జరు­గు­తోం­ది. స్థా­నిక ఎన్ని­కల వి­ష­యం­లో కాం­గ్రె­స్ పా­ర్టీ దూ­కు­డు­గా వె­ళ్తుం­టే బీ­ఆ­ర్ఎ­స్ అధి­నేత కే­సీ­ఆ­ర్ మా­త్రం ఇంకా ఎర్ర­వ­ల్లి ఫామ్ హౌ­స్‍కే పరి­మి­తం అయ్యా­ర­నే టాక్ ఉంది. ఈ ఎన్ని­క­ల్లో బీ­ఆ­ర్ఎ­స్ కచ్చి­తం­గా గె­లి­స్తే­నే రా­బో­యే రో­జు­ల్లో పా­ర్టీ­కి పూ­ర్వ­వై­భ­వా­ని­కి చా­న్స్ ఉం­టుం­ది. ఈ నే­ప­థ్యం­లో కే­సీ­ఆ­ర్ ఇప్ప­టి­కై­నా రా­జ­కీయ అజ్ఞా­త­వా­సం వీ­డు­తా­రా లేక కే­టీ­ఆ­ర్, హరీ­శ్ రావు పైనే ఈ ఎన్ని­కల భారం మో­పు­తా­రా అనే­ది వేచి చూ­డా­లి. బీ­జే­పీ నే­త­లు వేసే అడు­గు­ల­పై­నా అం­ద­రి దృ­ష్టి కేం­ద్రీ­కృ­త­మై ఉంది.

Tags

Next Story