Huzurabad Politics : కాంగ్రెస్ మార్క్ గేమ్.. ఒకే దెబ్బకు కొండాకు చెక్.. 2 నియోజకవర్గాల్లో..

Huzurabad Politics : హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కొత్త ఊహాగానాలకు తెరలేపింది. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన NSUI రాష్ట్ర అధ్యక్షుడిని హుజూరాబాద్ ఎన్నికల బరిలో నిలపడంపై కాంగ్రెస్ సీనియర్లే ఆశ్చర్యపోయారు. మొదట కొండా సురేఖ పేరును పరిశీలించారు. కొండాతోపాటు మరో ఇద్దరు స్థానిక లీడర్ల పేర్లను సైతం అధిష్టానం క్లియరెన్స్ కు పంపించారు. తీరా NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరును ఏఐసీసీ ప్రకటించడంతో గాంధీభవన్ వర్గాలతోపాటు సీనియర్లు సైతం షాకయ్యారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒంటరిగా నిర్ణయం తీసుకున్నారని, ఇది తన మిత్రుడు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావుకు వచ్చే ఎన్నికల్లో పోటీ లేకుండా చేసేందుకే వెంకట్ ను హుజూరాబాద్ కు పంపి.. మిత్రునికి లైన్ క్లియర్ చేశారని అంటున్నారు. మొత్తానికి హుజూరాబాద్ లో కాంగ్రెస్ డిపాజిట్ తెచ్చుకోవడమే గగనం అనుకుంటున్న స్థితిలో వెంకట్ ని బరిలో దింపి.. భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
పెద్దపల్లిలో మిత్రుడు విజయరమణారావుకు లైన్ క్లియర్ చేసినట్టే భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ రావును కూడా కాంగ్రెస్ లో చేర్పించడంతో కొండా దంపతులకు చెక్ పెట్టినట్టే అని టాక్ నడుస్తోంది. అందుకే హుజూరాబాద్ అభ్యర్థిగా మొదట కొండా సురేఖ పేరు తెరపైకి వచ్చినా.. చివరకు అసలా ముచ్చటే లేకుండా పోయింది. కనీసం ప్రచార కమిటీలో కూడా వారికి చోటు దక్కలేదు. అలా రెండు చోట్లా రెండు విధాలుగా పావులు కదిపి.. లైన్ క్లియర్ చేసింది అధిష్టానం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com