MALANNA: ఓసీలు నాకు ఓట్లెయ్యొద్దు: తీన్మార్ మల్లన్న

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చివరి ఓసీ సీఎం రేవంతే అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తే బీసీలు మాత్రమే ఓటు వేయాలని.. రెడ్లు, ఓసీలు వేయవద్దని స్పష్టం చేశారు. అతి త్వరలో బీసీల ఉద్యమ భూకంపం రాబోతోందని.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలదేనని స్పష్టం చేశారు. 2029లో తెలంగాణలో బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
రానున్నది బీసీల రాజ్యమే
రాష్ట్రంలో రానున్నది బీసీల రాజ్యమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. 54 శాతం ఉన్న బీసీలు చట్టసభల్లో నలుగురు మాత్రమే ఉండడం సరైంది కాదన్నారు.బీసీలంతా ఏకమై రాజ్యాధికారం కోసం ఉద్యమించే సమయం ఆసన్నమైందని, ఏకతాటిపైకి వచ్చి హక్కులను సాధించుకోవాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కుల గణన చేసి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
పోలీసులకు ఫిర్యాదు
కాంగ్రెస్ ఎమెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై రెడ్డి జాగృతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెడ్డిలపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రెడ్డి జాగృతి పోలీసులకు కంఫ్లైంట్ చేసింది. ఒకవేళ తాను మళ్లీ ఎన్నికల్లో నిలబడితే దయచేసి.. తనకు రెడ్డివాళ్లు, ఓసీలు తనకు ఓటు వేయకండి అంటూ కామెంట్ చేశారు. కేవలం బీసీల ఓట్లే తనకు సరిపోతాయని.. అవి సరిపోగా ఇంకా కొన్ని ఓట్లు కూడా మిగులుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. తన యూట్యూబ్ ఛానెల్లో రెడ్డిలు, ఓసీలకు సంబంధించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది.తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న రెడ్డి జాగృతి.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. ఫిర్యాదులో తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలపై రెడ్డి జాగృతి కీలక విషయాలను ప్రస్తావించింది. గతకొన్ని రోజులుగా.. తన య్యూట్యూబ్ ఛానెల్‌లో రెడ్డి జాతిని కించపరుస్తూ నానా దుర్భాషలాడుతున్నాడంటూ కీలక విషయాలు ప్రస్తావించింది. రాజ్యంగబద్దమైన పదవిని స్వీకరిస్తూ.. సమాజంలో ఉన్న అన్ని కులాలను, మతాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసిన తీన్మార్ మల్లన్న.. ఓసీ కులాల్లో ఉన్న పేదవాళ్లను కించపర్చటం గమనార్హమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com