Rahul Gandhi : కాసేపట్లో వరంగల్ బహిరంగ సభకు రాహుల్ గాంధీ..!

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం... శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా ఇతర కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు.
అనంతరం.. ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయలుదేరి వెళ్లారు. అటు.... వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్ నేతలు... భారీ ర్యాలీగా చేరుకుంటున్నారు. రాహుల్ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్‌లో నయా జోష్ కనిపిస్తోంది.
సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ కీలక నేతలంతా జన సమీకరణ మీద ఫోకస్ పెట్టారు. ఈ సభలో రైతు డిక్లరేషన్‌పై రాహుల్ గాంధీ ప్రకటన చేస్తారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. తెలంగాణలో కొత్త వ్యవసాయ విధానంపై డిక్లరేషన్ ఉండబోతోందన్నారు. ఈ సభ ద్వారా తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త ఉత్సాహం వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com