రేవంత్ రెడ్డి.. రాజీవ్ రైతు యాత్ర ఇవాళ్టితో ముగింపు..!

రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు యాత్ర ఇవాళ్టితో ముగుస్తుంది. హైదరాబాద్ శివారులోని రావిరాలలో బహిరంగ సభకు భారీగా రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈనెల 7వ తేదీన అచ్చంపేటలో ప్రారంభమైన రైతు యాత్ర.. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కొనసాగింది.
అచ్చంపేట నుంచి తుక్కుగూడ వరకూ 9 రోజులుపాటు 129 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇవాళ ముగింపు సభ సందర్భంగా తుక్కుగూడ నుంచి రావిరాల సభ వరకూ 16 కిలోమీటర్ల మేర ట్రాక్టర్ ర్యాలీ సాగనుంది.
కేంద్రం తీసుకొచ్చిన 3 చట్టాలను రద్దు చేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలు వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి రాష్టర్ ప్రభుత్వం కేంద్రానికి పంపాలని కోరారు. తెలంగాణలో నూతన చట్టాలను అమలు చేయబోమని ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు.
గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వమే అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కూడా రేవంత్ అన్నారు. పాదయాత్ర పొడవునా రైతులతో మమేకమైన రేవంత్.. అన్నదాతల పక్షాన తామెప్పుడూ పోరాడుతనే ఉంటామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com