Telangana | నేడు కొత్త సీఎం ప్రమాణస్వీకారం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా నూతన ముఖ్యమంత్రి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాజ్‌భవన్‌లో అధికారులు ప్రమాణస్వీకార ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ రాత్రి రాత్రి 8:15 గంటలకు రాజ్ భవన్ లో వీరి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను సోమవారం ఉదయం ఏఐసీసీ పరిశీలకులు స్వీకరించారు. సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గేకు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానంను రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. రేవంత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో సహా ఇతర ఎమ్మెల్యేలు బలపర్చారు.
ఇక సీఎల్పీ సమావేశానికి ముందు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో కాంగ్రెస్ ముఖ్యనేతలతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భేటీ అయ్యారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి బ్రదర్స్‌తో వివిధ అంశాలపై చర్చించారు.
మరోవైపు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ప్రమాణస్వీకారానికి రాజ్ భవన్ ముస్తాబవుతోంది. ఇందుకోసం రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరోవైపు... ఎన్నికల సంఘం గవర్నర్ ను కలిసి గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను సమర్పించనుంది. ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ కార్యక్రమం ఉంటుంది. సీఎం ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక ఇంకెవరైనా ఉంటారా అన్నది మాత్రం మరి కాలాసేపట్లో తేలనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com