CONGRESS: మరోసారి కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్

గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి అనివార్య కారణాల వల్ల పార్టీ మారిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ 22 నెలల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడంపై చర్చించామన్నారు. కాంగ్రెస్ ను వీడిన మారిన తిరిగి పార్టీలో చేర్చుకోబోతున్నామని మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ సాగుతున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్ అంతర్గత విభేదాలతో సతమతం అవుతుంటే మరో వైపు బీజేపీ చేరికలపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలను, కీలక నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్‌రావు ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్నారు. త్వరలో మరికొంత మంది నేతలు కాషాయ శిబిరంలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సైతం తిరిగి ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి సారించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో చూడాలి.
కామారెడ్డికి రాహుల్ గాంధీ..?
ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. 15న నిర్వహించే సభకు రాహుల్ గాంధీ, ఖర్గేలను ఆహ్వానించే యోచనలో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అలాగే.. భారీ జనసమీకరణ కోసం ప్లాన్ చేస్తున్నారు.. కామారెడ్డి సభకు సంబంధించి నేతలకు బాధ్యతలు అప్పగించబోతున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించింది కాంగ్రెస్.. ఈ క్రమంలో తమ నిర్ణయాలు, విధానాలను 15న జరిగే సభలో వివరించబోతుంది .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com