Telangana: రేపు ఖమ్మంలో కాంగ్రెస్ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి

రేపు ఖమ్మంలో నిర్వహించే కాంగ్రెస్ జన గర్జన బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐదు లక్షల మంది బహిరంగ సభకు తరలిరానున్నట్లు తెలుస్తోంది. జనగర్జన సభ వేదికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇక రేపటితో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కూడా ముగియనుంది.. ఈ సభా వేదికపై భట్టి విక్రమార్కను రాహుల్ ఘనంగా సన్మానించనున్నారు.. ఇక సభకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు ఏఐసీసీ అగ్రనేతలు హాజరుకానున్నారు.
మొత్తం 100 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తుండగా 50 ఎకరాల్లో పార్కింగ్ ప్లేస్ కోసం ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇక ఐదు లక్షల మంది జనాన్ని సమీకరించేందుకు నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. కాంగ్రెస్ నేతలను కలుపుకొని సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు పొంగులేటి అనుచరులు.. ఇక ఖమ్మం సభతో దూకుడు మరింత పెంచనున్నారు హస్తం నేతలు.. ఖమ్మం బహిరంగ సభ ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని కాంగ్రెస్ పూరించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com