congress: కాంగ్రెస్ నుంచి రాజగోపాల్‌రెడ్డి అవుట్..?

congress: కాంగ్రెస్ నుంచి రాజగోపాల్‌రెడ్డి అవుట్..?
X
రేవంత్‌పై నేరుగా ఎమ్మెల్యే విమర్శలు.. తీవ్రంగా పరిగణిస్తున్న క్రమశిక్షణా కమిటీ.. తరచూ సీఎం లక్ష్యంగా తీవ్ర విమర్శలు

ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి­పై నే­రు­గా వి­మ­ర్శ­లు చే­స్తు­న్న ఎమ్మె­ల్యే రా­జ­గో­పా­ల్‌­రె­డ్డి­పై కాం­గ్రె­స్ పా­ర్టీ వేటు వేసే అవ­కా­శం ఉంది. టీ­పీ­సీ­సీ క్ర­మ­శి­క్ష­ణా కమి­టీ రా­జ­గో­పా­ల్‌­రె­డ్డి వ్యా­ఖ్య­ల­ను చాలా సీ­రి­య­స్‌­గా పరి­గ­ణి­స్తోం­ది. సీఎం రే­వం­త్‌­తో పాటు కాం­గ్రె­స్ అధి­ష్టా­నం­పై తీ­వ్ర వి­మ­ర్శ­లు చే­య­డం.. డీకే శి­వ­కు­మా­ర్‌­తో­నూ ప్ర­త్యే­కం­గా భేటీ కా­వ­డం వంటి వి­ష­యా­ల­పై హస్తం పా­ర్టీ ఆగ్ర­హం­గా ఉంది. ము­ను­గో­డు ఎమ్మె­ల్యే కో­మ­టి­రె­డ్డి రా­జ­గో­పా­ల్‌­రె­డ్డి వ్యా­ఖ్య­ల­ను పీ­సీ­సీ క్ర­మ­శి­క్షణ కమి­టీ తీ­వ్రం­గా పరి­గ­ణి­స్తోం­ది. క్ర­మ­శి­క్షణ కమి­టీ ఛై­ర్మ­న్‌ మల్లు రవి రా­జ­గో­పా­ల్‌­రె­డ్డి­తో ఫో­న్‌­లో మా­ట్లా­డి­న­ట్లు తె­లు­స్తోం­ది. తరచూ సీఎం రే­వం­త్‌­పై వ్యా­ఖ్య­లు చే­స్తు­న్నా­ర­ని, ఆయన వ్యా­ఖ్యల వల్ల ప్ర­భు­త్వా­ని­కి, పా­ర్టీ­కి నష్టం కలు­గు­తోం­ద­ని క్ర­మ­శి­క్షణ కమి­టీ భా­వి­స్తోం­ది. పా­ర్టీ పై అను­చిత వ్యా­ఖ్య­లు చే­స్తూ, పా­ర్టీ బల­హీ­న­త­ల­ను బహి­ర్గ­తం చే­స్తు­న్న కా­ర­ణం­గా ఆయ­న­పై ముం­దు చర్య తీ­సు­కో­వా­ల­ని కూడా కాం­గ్రె­స్ పా­ర్టీ ఆలో­చి­స్తు­న్న­ట్లు­గా సమా­చా­రం. ఆయ­న­పై చర్య­లు తీ­సు­కో­వ­టా­న్ని రే­వం­త్ రె­డ్డి సమ­ర్ధి­స్తు­న్నా­రు. కో­మ­టి­రె­డ్డి రా­జ­గో­పా­ల్ రె­డ్డి పై చర్య­లు తీ­సు­కో­క­పో­తే, భవి­ష్య­త్తు­లో చాలా మంది నే­త­లు కాం­గ్రె­స్ పా­ర్టీ గు­రిం­చి ఇలాం­టి వ్యా­ఖ్య­లు చే­స్తూ పా­ర్టీ­ని మరింత బల­హీ­నం చేసే అవ­కా­శం కూడా లే­క­పో­లే­ద­ని భా­వి­స్తు­న్నా­రు. అయి­తే దీ­ని­పై త్వ­ర­లో­నే స్ప­ష్టత రా­నుం­ది.

కాంగ్రెస్‌లో కలకలం

ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి లక్ష్యం­గా కో­మ­టి­రె­డ్డి రా­జ­గో­పా­ల్‌­రె­డ్డి చే­స్తు­న్న వ్యా­ఖ్య­లు కాం­గ్రె­స్‌­లో కల­క­లం రే­పు­తు­న్నా­యి. గత కొ­న్ని రో­జు­లు­గా సీఎం వ్యా­ఖ్య­ల­ను, ఆయన వై­ఖ­రి­ని తప్పు­ప­డు­తు­న్న రా­జ­గో­పా­ల్‌­రె­డ్డి.. తాను ఎవ­రి­నీ వి­మ­ర్శిం­చ­డం లే­ద­ని, సూ­చ­న­లు మా­త్ర­మే చే­స్తు­న్నా­నం­టూ­నే తన­దైన శై­లి­లో వి­మ­ర్శ­లు కొ­న­సా­గి­స్తు­న్నా­రు. తానే పదే­ళ్లు సీ­ఎం­గా ఉం­టా­న­న్న రే­వం­త్‌ వ్యా­ఖ్య­ల­ను ఇటీ­వల బహి­రం­గం­గా­నే ఖం­డిం­చా­రు. అం­తే­కా­దు సమయం వచ్చి­న­ప్పు­డ­ల్లా రే­వం­త్‌­రె­డ్డి­ని లక్ష్యం­గా చే­సు­కు­ని మాటల తూ­టా­లు పే­లు­స్తుం­డ­టం కాం­గ్రె­స్‌ పా­ర్టీ­తో పాటు రా­జ­కీయ వర్గా­ల్లో చర్చ­నీ­యాం­శ­మ­వు­తోం­ది. రా­జ­గో­పా­ల్‌ వ్యా­ఖ్య­లు అప్ప­ట్లో­నే కాం­గ్రె­స్‌ శి­బి­రం­లో చర్చ­కు తె­ర­లే­పా­యి. వాటి వె­నుక ఆం­త­ర్య­మేం­ట­న్న సం­దే­హా­లు వ్య­క్త­మ­య్యా­యి. ఆ ఎపి­సో­డ్‌ మరు­గు­న­ప­డు­తోం­ద­ను­కు­నే లోపే రా­జ­గో­పా­ల్‌ మరో­మా­రు మరింత ఘా­టైన వి­మ­ర్శ­లు చే­శా­రు. సో­ష­ల్‌ మీ­డి­యా గు­రిం­చి రే­వం­త్‌­రె­డ్డి చే­సిన వ్యా­ఖ్య­ల­ను ఆయన తప్పు పట్టా­రు. ఆ తర్వాత బు­ధ­వా­రం కూడా అదే వై­ఖ­రి కొ­న­సా­గిం­చా­రు. రా­జ­గో­పా­ల్‌­రె­డ్డి వ్యా­ఖ్య­ల­న్ని­టి­పై కాం­గ్రె­స్‌ పా­ర్టీ­లో చర్చ జరు­గు­తోం­ది.

Tags

Next Story