TPCC: అభివృద్ధి సంక్షేమాలే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్‌

TPCC: అభివృద్ధి సంక్షేమాలే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్‌
విడుదల చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.... స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు

బీసీలకు అభివృద్ధి, సంక్షేమాలకు పెద్ద పీట వేస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించింది. బీసీల్లో అన్ని కులాలకు ప్రయోజనం చేకూరేట్లు డిక్లరేషన్‌ రూపకల్పన చేసింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచుతామని, ఆర్ధిక చేయూత అందిస్తామని వెల్లడించింది. మద్యం షాపుల లైసెన్సులలో గౌడ్లకు పస్ర్తుతం ఉన్న రిజర్వేషన్లు 15శాతం నుంచి 25 శాతానికి పెంచుతామని ప్రకటించింది. పంచాయతీలు, మున్సిపాలిటీలల్లో బీసీ రిజర్వేషన్లు 23నుంచి 42శాతానికి పెంచుతామని తెలిపారు. ప్రభుత్వ కాంట్రాక్టు నిర్మాణ పనుల్లో, నిర్వహణ కాంట్రాక్టులలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. బీసీ సబ్‌ ప్లాన్‌కు తగిన నిధులు మంజూరు చేయడం సహా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎంబీసీకులాల అభివృద్ధిని పర్యవేక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని, అన్నిబీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పా టు చేస్తామని తెలిపారు బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహణకు, ఉన్నత విద్య కోసం పది లక్షల రూపాయల వరకు పూచీకత్తు, వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్లుప్రకటిం చారు.


ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలకు సమానంగా బీసీలకు ఒక గురుకులం, ప్రతి జిల్లాలో.. ఒక కొత్త డిగ్రీ కళాశాల, 3 లక్షలరూపాయలకు తక్కువ వార్షిక ఆదాయం కలిగిన బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా.. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని తెలిపారు. బీసీ కులాల్లో చేతివృత్తులను ప్రోత్సహించేందుకు “వృత్తి బజార్”పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్‌లు ఏర్పా టు చేస్తామన్నారు.బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి 10 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని తెలిపింది.అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గొల్లకురుమలకు రెండో దశ గొర్రెల పంపిణీ.., ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో ఐదెకరాలు కేటాయిస్తామని తెలిపారు. మద్యం షాపుల లైసెన్సుల్లో.. గౌడ కులస్తులకు రిజర్వేషన్లు 15నుంచి 25 శాతానికి పెంచుతామని తెలిపారు.


బీసీల సంక్షేమానికి ప్రతి ఏడాది ఇరవై వేల కోట్లు లెక్కన అయిదు సంవత్సరాలల్లో లక్ష కోట్లు కేటాయించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యంతోపాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేస్తామని వివరించింది. పభ్రుత్వ కాంట్రాక్టు నిర్మాణ పనుల్లో, నిర్వహణ కాంట్రాక్టులలో కూడా బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. బీసీ సబ్‌ ప్లాన్‌కు తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యో తిరావు ఫూలే బీసీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొ రేషన్ల ఏర్పా టు చేస్తామని, బీసీయువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అన్నిజిల్లా కేంద్రాల్లో రూ.50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీసర్కిల్, లైబర్రీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు నిర్మిస్తామని, బీసీఐక్యత భవన్‌లోనే జిల్లా బీసీసంక్షేమ కార్యా లయం ఏర్పా టు చేస్తామని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story